స్టార్ హీరో మైండ్ బ్లాక్, బెంగళూరు టూ మైసూరు, హత్య చేసి ఏం చేశాడంటే ?
చిత్రదుర్గ హీరో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన కన్నడ సినీనటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అండ్ గ్యాంగ్ ను పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తుండటంతో కర్ణాటక ప్రజలు అక్షరాలా ఉలిక్కిపడటం ఆరాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. కేసు విచారణ జరుగుతుండగా ఈ కేసులో పలువురు ప్రముఖ పేర్లు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌తో పాటు పలువురు అరెస్టు అయ్యారు. ఇప్పుడు కన్నడ హీరోకు నోటీసులు ఇచ్చారు. ఈ హత్య కేసులో హాస్యనటుడు, హీరో చిక్కన్న ఉన్నారని వెలుగు చూడటంతో ఆయనకు నోటీసులు పంపామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా కన్నడ నటుడు చిక్కన్న వెల్లడించారు. ఈరోజు మంగళవారం నటుడు దర్శన్‌ను మైసూరు తీసుకెళ్లేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు ఆకేసులోని హీరో గ్యాంగ్‌ను గత కొన్ని రోజులుగా బెంగళూరు పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరులో రేణుకాస్వామిని హత్య చేసిన తరువాత నటుడు దర్శన్ మైసూర్ వెళ్లి ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. ఈ సందర్భంలో రేణుకాస్వామి హత్య కేసులో కొందరు లొంగిపోవడానికి అంగీకరించకపోవడంతో వారిని మైసూరుకు పిలిపించిన హీరో దర్శన్ వారిని కేసులో లొంగిపోవాలని ఒప్పించే ప్రయత్నం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.
అందుకే మైసూరులో కూడా విచారణ ముఖ్యం కావడంతో పోలీసులు ఈరోజు దర్శన్ ను మైసూరుకు తీసుకెళ్తున్నారు. రేణుకాస్వామి హత్య నిందితుడు దర్శన్‌తో పాటు పవన్, నాగరాజ్, నందీష్, లక్ష్మణ్, దీపక్‌లను ఈరోజు (జూన్ 18వ తేదీ) మైసూర్ తీసుకెళ్లే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. మైసూరులోని ఓ ప్రైవేట్ హోటల్ సహా పలు ప్రాంతాల్లో దర్శన్ బస చేసేశాడని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోకి అతన్ని తీసుకెళ్లి విచారణ చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
మొత్తానికి మైసూర్‌లో హీరో దర్శన్ ఏం చేశాడు, హోటల్ లో హత్య కేసుకు సంబంధించి ఎవరెవరితో చర్చలు జరిగాయి అనే విషయాన్ని విచారించనున్నారు. జూన్ 11వ తేదీన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌తో పాటు పవిత్రగౌడ్, పవన్, వినయ్ తో సహా మొత్తం ఇప్పటి వరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిలో ఉంది.
ఇప్పటికే నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నేడు మైసూరులో నటుడు దర్శన్ బస చేసిన ప్రాంతాలను సందర్శించి విచారించనున్నారు. ఈ సందర్బంగా బెంగళూరులోని మైసూరుకు వెళ్లే రహదారితో పాటు మైసూరు సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. హీరో దర్శన్ తో పాటు పలువురుని మైసూరుకు రహస్యంగా పిలుచుకుని వెళ్లే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications