గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా: బాలయ్యపై మోక్షజ్ఞ ఆగ్రహం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో శ్రీలీలను ఉద్దేవించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను చిచ్చా చిచ్చా అంటూ టార్చర్ పెట్టిందని, నా తర్వాత సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నానన్నారు.
అదే విషయాన్ని ఇంట్లో చెప్పానని, ఆ మాట విని మా అబ్బాయి మోక్షజ్ఞ తనపై కోప్పడినట్లు బాలయ్య చెప్పారు. తాను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాను... కుర్ర హీరోను.. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తావా? అని అడిగాడని, మోక్షజ్ఞ మాటలకు తాను సమాధానం చెప్పలేకపోయినట్లు తెలిపారు. శ్రీలీల గొప్ప నటి అని, మంచి భవిష్యత్తు ఉందంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో తాను పోషించిన విజ్జీ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందన్నారు.

విజ్జి పాప పాత్ర కోసం తనను ఎంపిక చేసినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్యూ చెప్పాలి అని వ్యాఖ్యానించింది. ఎన్ని పాత్రల్లో నటించినా కేవలం కొన్ని మాత్రమే మన మనసుకు దగ్గరవుతాయని, అలా తనకు ఎంతో చేరువైన పాత్ర ఇది అన్నారు.
కథ విన్న సమయంలోనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, తన జీవితంలో చూడని కొన్ని అనుభూతులను ఈ సినిమా అందించిందన్నారు. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు షాట్ అయ్యాక కూడా నేనింకా అదే పాత్రలో ఉండిపోయేదాన్ని అన్నారు. ఇది గొప్ప కథ.. అందమైన సందేశం ఉందన్నారు. ఇలాంటి కథలో భాగమైనందుకు అదృష్టవంతురాలిని అని శ్రీలీల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications