Bigg Boss Telugu 8:హౌజ్‌లోకి ఆ బ్యూటీ ఎంట్రీ..ఇక మామూలుగా ఉండదు..!!

Bigg Boss Telugu 8:అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మరో బ్రాండ్ న్యూ సీజన్‌కు రెఢీ అయ్యింది బిగ్‌బాస్ రియాల్టీ షో. ఇప్పటికే ఈ షో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కంటెస్టెంట్లపై చాలా ఆసక్తి నెలకొంది. ఈ బ్రాండ్ న్యూ సీజన్‌లో కంటెస్ట్ చేయబోయే వారి పేర్లు ఇప్పటికే లీకయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8.

2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక రెండవ సీజన్‌కు నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా వ్యవహరించినప్పటికీ ఎన్టీఆర్ లెవెల్‌లో షోను క్యారీ చేయలేకపోయాడనే వాదన వినిపించింది. ఇక మూడవ సీజన్ నుంచి వెటరన్ యాక్టర్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా సత్త చాటుతూ ఇప్పటికీ కొనసాగుతున్నారు. రెండవ సీజన్ 6వ సీజన్‌లో అటు సెలబ్రిటీలు, ఇటు సామాన్య ప్రజలు హౌజ్‌మేట్స్‌గా ఉన్నారు. మరి ఈ సారి సీజన్‌లో కూడా దుమ్మురేపే కంటెస్టెంట్స్ దర్శనిమిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Bigg Boss Telugu 8 Dancer on small screen to enter the house full details here

బిగ్‌బాస్ తెలుగు ఏడవ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌ కోటాలో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ నెగ్గాడు. మరి ఇప్పుడు ఎవరై ఉంటారా అనే ఆసక్తి నెలకొంది. అంతకంటే ముందు ఈ సీజన్‌లో పాల్గొనబోయే కొంతమంది కంటెస్టెంట్‌ల పేర్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.హీరో ఆదిత్య ఓం,యాంకర్ విష్ణుప్రియ,కమెడియన్ అభయ్ నవీన్,బెజవాడ బేబక్క,యాంకర్ నటి సౌమ్య,న్యూస్ ప్రెజెంటర్ కల్యాణి,సహర్ కృష్ణన్,కిర్రాక్ సీత,సీరియల్ నటుడు నిఖిల్ మలియాకల్,విస్మయశ్రీ,నాగ మణికంఠ, తన వాయిస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆర్జే శేఖర్ భాష,సీరియల్ నటి అంజలి పవన్,యష్మీ గౌడ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా వీరంతా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. తాజాగా మరో క్యూట్ పాప పేరు కూడా వినిపిస్తోంది.

Bigg Boss Telugu 8 Dancer on small screen to enter the house full details here

హౌజ్‌లోకి నైనికా

స్మాల్ స్క్రీన్‌ పై తన డ్యాన్స్‌తో మైమరిపించి, దిగ్గజ కొరియోగ్రాఫర్ల చే సలాం కొట్టించుకున్న నైనికా పేరు తాజాగా వినిపిస్తోంది. నైనిక ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సాయి అనే మరో కంటెస్టెంట్‌తో కలిసి ఆమె పండించిన కెమిస్ట్రీ మామూలుగా లేదు. అంతేకాదు ఢీ షో అయ్యాక వీరిద్దరూ కలిసి చేసిన రీల్స్ తెగ వైరల్ అయ్యేవి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఆ వార్తలకు బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చేది. ఇక ఈ ప్రెటీ గర్ల్ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో మరింత ఆసక్తిని పెంచేస్తోంది. కింగ్ నాగార్జున చెప్పే డైలాగ్ ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు అన్నది ప్రేక్షకులకు ఎక్కేసింది. దీంతో సీజన్ మొత్తం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+