బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఒకరికి బదులు మరొకరు ఎలిమినేషన్

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ షో ఏడో వారం ఎలిమినేషన్‌ ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ నుంచి బయటకు రావడానికి హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌ అయ్యారు. వీరిలో ఎవరికి తక్కువ ఓట్లు పోల్ అయితే వారు హౌస్ నుంచి బయటకు వస్తారు. ఈ వారం టేస్టీ తేజ లేదా పృథ్వీ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. వీరికే అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మణికంఠ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఎలిమినేషన్‌కి సంబంధించి ముందుగానే హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు ఓ హింట్‌ ఇస్తుంటారు. వాళ్ల గురించి, వాళ్ల ఆటతీరుగురించి చెప్పి.. క్లాస్‌ పీకుతుంటారు. శనివారం ఎపిసోడ్‌లో మణికంఠని టార్గెట్‌ చేస్తూ షో జరిగింది. ఇందులో ఆటలో వీక్‌, డ్రామాలో పీక్‌, కన్నీళ్లు మాత్రమే నా ఆయుధం అనే ట్యాగ్‌ ఇచ్చింది యష్మి. దీన్ని చాలా మంది హౌజ్‌మేట్స్ సపోర్ట్ చేశారు. దీంతో అందరూ మణికంఠను టార్గెట్‌ చేసుకున్నారనే విషయం అర్థం అయింది.

Bigg Boss Telugu 8 manikanta will be 7th week elimination

దీనిపై మణికంఠ వివరణ ఇస్తూ తనకు ఇక్కడ ఉండటం అవడం లేదు, తాను ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్‌ అయిపోతున్నా అని తెలిపారు. తన హెల్త్, బ్రెయిన్‌ సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. హార్ట్‌లో పెయిన్‌ స్టార్ట్ అవుతుందని, బ్రెయిన్‌ పనిచేయడం లేదు, బోన్స్ నొప్పిగా ఉన్నాయని, కూర్చుంటే నిలబడలేకపోతున్నా అని, పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నారు. నిజంగానే ఈ ఆట అంటే ఇష్టమని, కానీ ఆడలేకపోతున్నా అని, తనని బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి పంపించమని నాగార్జునన వేడుకున్నాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఓటింగ్‌ ఎలా ఉందో, ఆడియెన్స్ ఏం డిసైడ్‌ చేశారో చూద్దామన్నారు. అయితే చివరగా ఓటింగ్‌ ప్రకారంగానే మణికంఠని ఎలిమినేట్‌ చేశారని సమాచారం. అంటే తేజని కాదని మణికంఠని కావాలనే ఎలిమినేట్‌ చేసినట్టు తెలుస్తుంది. అందుకు కారణం మణికంఠ చెప్పిన కారణాలే తెలుస్తోంది.

ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. అయితే నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేషన్ అయింది. ఇక ఆ వారం మీడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓంను హౌస్ నుంచి బయటకు పంపించారు.ఐదో వారం నైనికా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఐదో వారమే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్ ఓ గ్రూప్, ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న సభ్యులంతా మరో గ్రూప్‌గా విభజించారు. ఇక చివరి వారం హౌస్ నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఇక ఏడో వారం హౌస్ నుంచి మణికంఠ బయటకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది అఫిషీయల్‌గా ఆదివారమే తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+