ఏకంగా ఎంపీనే లైన్లో పెట్టిన స్టార్ సెలబ్రిటీ
దేశంలోని ఓ యంగ్ ఎంపీ పెళ్లికి రెడీ అయ్యారు. అది కూడా ఓ సెలబ్రిటీతో కావడం ఇక్కడ విశేషం.ఆ ఎంపీ మరెవ్వరో కాదు..తేజస్వి సూర్య.దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు తేజస్వి సూర్య. 2019లో జరిగిన ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి మొదటిసారి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 28 సంవత్సరాలు.
బీజేపీ తరపున పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఆ సమయంలో సంచలనం సృష్టించారు.తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైకి చెందిన గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. . 29 ఏళ్ల శివశ్రీ శస్త్ర యూనివర్సిటీలో బయో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీలో భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు.

శివశ్రీ స్కంద ప్రసాద్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీత, నృత్య కళాకారిణి. కర్ణాటక సంగీతం మరియు భరతనాట్యం రంగాలలో ఆమె సాధించిన విజయాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆమె అద్భుతమైన గాత్రంతో కర్ణాటక సంగీతానికి కొత్త రూపునిచ్చారు. ఆమె పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.అనేక సంగీత కచేరీలు, ఉత్సవాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు.మార్చి 24వ తేదీన బెంగళూరులోనే ఆయన వివాహం జరగనుంది.ఈ విషయాన్ని ఎంపీ తేజస్వి సూర్యనే బెంగళూరులో ప్రకటించారు.












Click it and Unblock the Notifications