'పవన్ కల్యాణ్' పై సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్ ద్వారా పార్టీని నడిపించవచ్చనే అభిప్రాయంతో సినిమాలను ఒప్పుకుంటున్నారు. అయితే ఒకవైపు రాజకీయంగా యాత్రలు చేస్తుండటంతో షెడ్యూల్ ప్రకారం సినిమాలు పూర్తికావడంలేదు. మరో నాలుగు నెలల్లో ఏపీ ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈలోగా ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నారు.
అయితే హరిహర వీరమల్లు సినిమా మాత్రం అదిగో, ఇదిగో అనడమేకానీ ముందుకు కదలడంలేదు. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీనితర్వాత మొదలైన సినిమాలన్నీ పూర్తిచేసుకొని విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ మాత్రం రావడంలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు.

మొన్నటివరకు హరిహర వీరమల్లు ఆగిపోయిందనే టాక్ నడిచింది. అయితే అది నిజమేనని తేలింది. ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న యానిమల్ సినిమాలో కూడా బాబీ విలన్ గా నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన బాబీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ తెలుగు సినిమాను ఒప్పుకున్నానని, సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిందన్నారు. బాబీ ఒప్పుకుంది హరిహర వీరమల్లు సినిమానే కాబట్టి దాదాపుగా అది ఆగిపోయినట్లేనని అంటున్నారు. దర్శకుడు క్రిష్ దీనిపై ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications