కచ్చితంగా విడాకులు తీసుకుంటాం ఒట్టు.. మరో స్టార్ కపుల్ సంచలనం.. కారణం అదేనా?

ఇటీవల కాలంలో సెలబ్రిటిల విడాకులకు సంబంధించి తరచూ వార్తలు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఈ విడాకుల జాబితా పెరిగిపోతూనే ఉంది. ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో తెలియడం లేదు. ప్రేమ వివాహాలు చేసుకున్నా నెలల వ్యవధిలోనే సెలబ్రిటీ కపుల్స్ విడాకుల బాట పడుతున్నారు. తాజాగా మరో జంట విడాకుల విషయం తెరపైకి వచ్చింది.

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులపై సోషల్ మీడియాలో విడాకుల ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్‌ అధికమైంది. ఈ జంట ఏ పోస్టు పెట్టినా విడాకుల గురించే కామెంట్లు చేస్తున్నారు. ఆఖరికి ఓ వ్యక్తి మీరు విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే ఉందని ఓ పోస్ట్ కింద షాకింగ్ కామెంట్ చేశాడు. అది చూసిన సోనాక్షికి ఒక్కసారిగా కోపం వచ్చింది. అవునా.. ముందు మీ అమ్మానాన్నకు విడాకులు అవనీ.. తర్వాత కచ్చితంగా మేము తీసుకుంటాం. ఒట్టు అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. అది చూసిన నెటిజెన్లు.. ఇలాంటి వాళ్లకు ఇలాగే గడ్డిపెట్టాలని సోనాక్షిని సపోర్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ ఏడేళ్లపాటు ప్రేమించుకున్నారు. 23 జూన్‌, 2024న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే వీరిది మతాంతర విహహం కావడం వల్ల అప్పటినుంచి వీరిపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. మరోవైపు ఇదే వ్యవహారంపై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా తీవ్రంగా స్పందించారు. తన కూతురు రాజ్యాంగవిరుద్ధంగా,చట్టాన్ని అతిక్రమించే విధంగా ఏ తప్పూ చేయలేదే? పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయం. వారి మధ్యలోకి దూరేందుకు ఎవరికీ అర్హత లేదు. వాళ్లను విమర్శించేవాళ్లకు నేనొక్కటే చెప్పదల్చుకున్నా.. వెళ్లి మీ పని చూసుకోండి. మీ జీవితాన్ని ముందు చక్క దిద్దుకోండి అని చెప్పుకొచ్చారు.

Bollywood Actress Sonakshi Sinha Responds to Divorce Speculations

ఇక హీరోయిన్ సోనాక్షి సిన్హా.. దబాంగ్ సినిమాతో హిందీలో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. జటాధర సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా వెంకట కల్యాణ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+