ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా?
దేశభక్తి సినిమాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. థియేటర్ అయినా ఓటీటీ అయినా జనాలు ఎగబడి చూసే సినిమాల్లో హారర్, యాక్షన్, దేశభక్తి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. దేశభక్తి సినిమాలకు భారత్ పెట్టింది పేరు. ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న ధురంధర్-2 మూవీ కూడా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఓటీటీలోనూ అదే రేంజ్ లోనూ సత్తా చాటుతున్న మూవీ బోర్డర్-2.
ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్-2 చిత్రం ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇక మార్చి 20 నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో బోర్డర్-2 చిత్రం నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్నారు.

ఇక బోర్డర్- 2 మూవీ 1997 లో విడుదలై సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీజ్ డోసాంజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరిలో బోర్డర్-2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.480 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సీక్వెల్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ బోర్డర్-2 సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.












Click it and Unblock the Notifications