మరో సావిత్రిలా మారిన సమంత జీవితం..రెండో పెళ్లిలో ట్విస్ట్..!
సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా అందరికి షాకిస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత జీవితం మరో సావిత్రిలా మారిపోయిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సమంత కూడా సావిత్రి మాదిరిగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి ,జెమినీ గణేషన్ మధ్య ఏర్పడిన ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

వివాహం అనంతరం సావిత్రి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి అయ్యాక సావిత్రికి సినిమా ఛాన్స్‌లు ఎక్కువగా రావడం, అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎగబాకడం జరిగింది. సావిత్రి లేని సినిమా అంటూ అప్పుడు లేదు. సావిత్రి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ప్రేక్షకులు ఎదురుచూసేవారు. క్రమంగా సావిత్రి పెద్ద స్టార్‌గా ఎదగడం చేతినిండా సినిమాలు ఉండటంతో ఆమె బిజీగా మారిపోయారు. భర్త జెమినీ గణేశన్‌కు సమయం కేటాయించడం తగ్గిపోయింది. అలా అని ఆమె గుండె నిండా జెమినీ గణేశనే ఉన్నాడు.
ఇక సావిత్రి ఒక స్టార్ హీరోయిన్‌గా మారడం, ఇండస్ట్రీ మొత్తం సావిత్రి వెనకాలే ఉండటం,ఎటు చూసినా సావిత్రి పేరే జపించడం చూసిన జెమినీ గణేశన్ ఓర్వలేకపోయాడు.తాను తీసుకొచ్చిన సావిత్రి తనకంటే పై స్థాయికి ఎదగడం చూసి ఓర్వలేకపోయాడు. దీంతో ఆయన వేరుగా మరో మహిళలతో ఉండటం ప్రారంభించాడు. సావిత్రి ఎన్నిసార్లు వెళ్లి బతిమిలాడినప్పటికీ ఆమెను అసహ్యించుకున్నాడే తప్ప దగ్గరకు చేరనీయలేదు. ఒకరోజు జెమినీ గణేశన్ ను మరో మహిళతో ఉండటం చూసిన సావిత్రి షాక్ అయ్యింది. అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, మద్యానికి బానిసైంది.

కటిక పేదరికంలోకి దిగిజారిపోవడం క్రమంగా ఆరోగ్యం క్షీణించడం, చివరికి కన్నుమూసింది. ఇదంతా మహానటి సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు నాగ్ అశ్విన్. విచిత్ర ఏమిటంటే మహానటి సినిమాలో సమంత , నాగ చైతన్య ఇద్దరూ నటించారు. సావిత్రి మాదిరిగానే సమంతకు సైతం ఇండస్ట్రీ టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు ఉంది. . సావిత్రి ,జెమినీ గణేషన్ మాదిరిగానే వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికే సమంతకు ఇండస్ట్రీలో కానీ బయట కానీ మంచి గుర్తింపు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమైంది. దీంతో సావిత్రిలానే సమంతకు కూడా క్రేజ్ పెరిగిపోయింది.
క్రేజ్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. నాగ చైతన్య మాత్రం కెరీర్ పరంగా చూస్తే సరైన హిట్ లేక డీలా పడ్డాడు. ఓవైపు సమంత హిట్ మీద హిట్ కొట్టి క్రేజ్ మరో లెవెల్‌కు పోతుంటే... నాగ చైతన్య పై మాత్రం ఫ్లాప్ స్టార్ అనే ముద్ర పడింది. సమంత మాత్రం నాగచైతన్య అంటే పడి చచ్చేది. ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కడవచ్చాయో తెలీదు కానీ, పెద్దలు కూడా వీరి మధ్య సఖ్యత కుదర్చలేకపోయారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నట్లు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సమంత ఒంటరి జీవితం ప్రారంభించింది.

ఒకానొక సమయంలో చాలా డిప్రెషన్‌కు గురైనట్లు తానే స్వయంగా పలు వేదికలపై చెప్పుకొచ్చింది. ఇక క్రమంగా సమంత ఆరోగ్యం కూడా క్షీణించింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడింది. ఓ వైపు కెరీర్ మంచి జోష్‌లో ఉండగా జరిగిన ఘటనతో సమంతా కూడా కృంగిపోయింది. అయితే సమంత సావిత్రిలా కృంగిపోలేదు. ఇవి అప్పటి రోజులు కాదు. ధైర్యం తెచ్చుకుంది. తిరిగి తన కెరీర్ పై ఫోకస్ చేసింది. ముందుకు దూసుకెళుతోంది. బాగా పరిశీలించి చూస్తే సమంత , సావిత్రిలా జీవితాలు రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. మరి సావిత్రి మాదిరిగా సమంత రెండో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications