"ప్రధాని మోదీ కోసం 'అఖండ 2' స్పెషల్ షో"
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ 2 చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో దేశం, దైవం, ధర్మం అనే మూలాల గురించి నేటి తరానికి వివరించిన తీరు అబ్బుర పరుస్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ పేరుతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.
ఈ సినిమా చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని బాలయ్య అన్నారు. ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో అఖండ చిత్రంలో చూపించామని తెలిపారు. ఈ అఖండ 2 చిత్రంలో మనిషే దేవుడు అయితే ఎలా ఉంటుందో చూపించామని బాలయ్య వివరించారు. అఖండ 2 సినిమాలో ప్రతి డైలాగ్ ఓ ఆణిముత్యం అని అన్నారు. ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు వరుసగా హిట్స్ కొట్టానని.. ఆరో సినిమా కూడా రాబోతోందని బాలయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ సక్సెస్ తన ఒక్కడి వల్లే వచ్చింది కాదని.. ఎంతో మంది కృషి ఉందని వివరించారు.
ఇక అఖండ- 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ సినిమా దేవుడి సంకల్పం అని.. దేవుడు అనుకుంటే గెలుపే ఉంటుందని ఎమోషనల్ అయ్యారు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అఖండ 2 త్రీడీలో సరికొత్త అనుభూతిని పంచుతోందన్నారు. సినిమా పరిశ్రమ అంతా ఒకే వేదికపైగా రావాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని పేర్కొన్నారు. అలాగే ఈ మూవీని దిల్లీలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అఖండ 2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని వివరించారు. మరోవైపు ఈ మూవీపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనును అభినందించారు. సినిమా అఖండ విజయం సాధించాలని ఆశీర్వదించారు.

ఇక అఖండ 2 మూవీ.. 2021 లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీలోనూ బాలయ్య డ్యూయల్ రోల్ లో మెప్పించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీ డిసెంబర్ 12 న రిలీజైంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications