బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు..శిక్ష తప్పదా..?
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలకు పల్లవి ప్రశాంత్ అభిమానులే కారణమని పోలీసులు. గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకోగా.. మరి కొందరిని సీసీ కెమెరా ద్వారా గుర్తించే పనిలో పడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై సైతం కేసు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.147, 148,290,,353,427,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ పోలీసుల ముందు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉల్టా ఫుల్టా అంటూ వచ్చిన బిగ్‌బాస్ 7వ సీజన్ అంచనాలు దక్కట్టుగానే ఆకట్టుకుంది. 105 రోజుల పాటు సాగిన ఈ షో ఆదివారంతో ముగిసింది.

ఫైనల్లో అమరదీప్, పల్లవి ప్రశాంత్‌లు తలపడగా, విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. అమరదీప్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాన్య వ్యక్తిగా, రైతు బిడ్డగా షోలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో..అతని అభిమానులు రెచ్చిపోయారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చ చేశారు. రోడ్డు మీదకు వచ్చిన అభిమానులు ప్రభుత్వ బస్సు అద్ధాలు పగల కొట్టడంతో పాటు, అమరదీప్, అశ్వినీ శ్రీ, ,గీతు రాయల్ కార్లను ధ్వంసం చేశారు.

అర్థరాత్రి వరకు పల్లవి ప్రశాంత్ అభిమానులు రోడ్ల మీద హంగామా సృష్టించారు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా పల్లవి ప్రశాంత్ మీదనే పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో అని బిగ్‌బాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications