అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వ ఉగ్రరూపం
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందగా, ఆమె తొమ్మిదేళ్ళ కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరాత్రి జైలు జీవితం గడిపాడు. సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారేకానీ బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించడంలేదు. క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు జడ్జిని ప్రశ్నించారు. అయినప్పటికీ మధ్యంరత బెయిల్ మంజూరైంది. నాలుగువారాల తర్వాత నాంపల్లి కోర్టులో తేల్చుకోమని తెలంగాణ హైకోర్టు సూచించింది.
దూషించినవారి అరెస్ట్ లు
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని దూషిస్తూ అల్లు అర్జున్ అభిమానులు పోస్టులు పెట్టారు. అలాగే అరెస్ట్ ను సమర్థించినవారిని, వారి కుటుంబ సభ్యులను కూడా దూసిస్తూ అనుచితంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేయబోతోంది. చాలామంది బన్నీ అభిమానులు తాము పెట్టిన పోస్టులను ఇప్పటికే తొలగించారు. రాజకీయ ముసుగులో అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందించినవారిని, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ, ప్రభుత్వంపైనే దుష్ప్రచారం చేసినవారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేసులు నమోదు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే కేసులు నమోదు చేయబోతున్నారు. అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంతర బెయిన్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. సంధ్య థియేటర్ ను ఎందుకు సీజ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీచేశారు. జాతీయస్థాయిలో సంచలనంగా మారిన ఈ కేసులో రాబోయే రోజుల్లో ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని అర్థమవుతోంది. నాంపల్లి కోర్టులో నాలుగు వారాల తర్వాత బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంటుంది. కోర్టు బన్నీకి బెయిలిస్తుందా? రిమాండ్ కు పంపిస్తుందా? అనే విషయం అప్పుడే తేలుతుంది. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ కు మాత్రం పుష్ప2 ఘనవిజయం సాధించిన ఆనందం మాత్రం నిలవలేదు.












Click it and Unblock the Notifications