ఓ పక్క సినిమా సూపర్ హిట్, ఇప్పటికే వందల కోట్లు లాభం, పొలీస్ స్టేషన్ లో హీరో, ఏం జరిగింది ?

బెంగళూరులోని జెట్ లాగ్ పబ్ లో అర్దరాత్రి దాటిన తరువాత తెల్లవారు జామున వరకు పార్టీ చేసుకున్నారని నమోదు అయిన కేసులో కర్ణాటక పోలీస్ చట్టం, ఎక్సైజ్ శాఖ చట్టం కింద స్టార్ హీరోతో పాటు సినిమా నటీనటుల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కన్నడ నటుడు, చాలెజింగ్ స్టార్ దర్శన్ తో పాటు ఇతర నటీనటులు బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీస్ స్టేషన్‌ లో విచారణకు హాజరయ్యారు.

ఈకేసు సంబంధించి చాలెంజింగ్ స్టార్ దర్శన్. చిక్కన్న, ధనంజయ్, నినాసం సతీష్. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, తరుణ్ సుధీర్ సహా 8 మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల బృందం ఎనిమిది మందిని విచారించింది. సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సురేష్, శ్రీరాంపూర్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, మల్లేశ్వరం ఇన్ స్పెక్టర్ జగదీష్ కేసు విచారణ చేపట్టారు.

Challenging star Darshan, who appeared before the police in Bengaluru, is a member of Kateras film unit

అభిమాన హీరోతో పాటు నటీనటులు వస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ శుక్రవారం సాయంత్రం సుబ్రమణ్యనగర పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో గుమికూడటంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు బెంగళూరులోని డాక్టర్ రాజ్ కుమార్ రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. సినీ ప్రముఖులను విచారించిన దర్యాప్తు అధికారులు దాదాపు పదిహేను ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

పోలీసుల విచారణ అనంతరం బయటకు వచ్చిన చాలెంజింగ్ స్టార్, కాటేరా సినిమా హీరో దర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన చిక్కన్న (చిన్నన్న) సినిమా విడుదల అవుతుందని, మీరు అందరూ ఆ సినిమా చూడాలని చెప్పి తరువాత ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాటేరా సినిమా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తరువాత బయటకు వచ్చి ఆవేశంతో ఊగిపోయారు. ఈ కేసులో కావాలనే హీరో దర్శన్ తో పాటు మాఅందరి పేర్లు ఇరికించారని ఆరోపించారు

మాకు ఉన్న పేరు చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, మేము పబ్ లో భోజనానికి వెళ్ళామని, అందుకే వాళ్ల మామీద తప్పుడు కేసులు పెట్టారని రాక్ లైన వెంకటేష్ ఆరోపించారు. ఒరాయన్ మాల్‌లో సెలబ్రిటీ షో నిర్వహించామని, మూడో తేదీని ఆ షో నిర్వహించామని, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆ షోలో పాల్గొన్నారని, తరువాత షో పూర్తి అయ్యేటప్పటికి అర్థరాత్రి దాటి పోయిందని రాక్ లైన వెంకటేష్ చెప్పారు.

Challenging star Darshan, who appeared before the police in Bengaluru, is a member of Kateras film unit

తరువాత జెట్ లాగ్‌ పబ్ కు అందరూ వెళ్లి డిన్నర్ చేద్దామని తాను నటీనటులకు చెప్పానని, అయితే మేము ఆ పబ్ లో లేట్ నైట్ పార్టీ చేసుకోలేదని, అర్థరాత్రి భోజనం ఏర్పాటు చేశామని, మేము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగించలేదని, కేవలం అర్దరాత్రి భోజనం చేశామని, అక్కడికి పోలీసులు కూడా రాలేదని రాక్ లైన్ వెంకటేష్ అన్నారు. ఇంత చిన్న విషయానికి ఇలా జరుగుతోందని మేము ఊహించలేదని, కావాలనే మా మీద నిందలు వేసి ఇలా కేసులు పెట్టారని రాక్ లైన్ వెంకటేష్ ఆరోపించారు.

బెంగళూరులోని చాలా రెస్టోబార్లు అర్థరాత్రి వరకు తెరిచి ఉంటాయని, వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వడంలేదని, కానీ వారు మాకు నోటీసులు ఇచ్చారని, అర్దరాత్రి ఒంటిగంట తరువాత మేము పబ్ లో భోజనం చేశామని, పబ్ లో సరిపడా భోజనం లేకపోవడంతో వారు వంట చేసేలోపు ఆలస్యం అయ్యిందని, చట్టపరంగా మేము న్యాయపోరాటం చేస్తామని, అర్దరాత్రి దాటిన తరువాత పబ్ దగ్గరకు పోలీసులు ఎవ్వరూ రాలేదని కాటేరా సినీ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ వివరించారు అర్దరాత్రి దాటిన తరువాత జెట్ లాగ్ పబ్ లో కాటేరా చిత్ర యూనిట్ పార్టీ చేసుకున్నారని ఇటీవల ఆ టీమ్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+