నా మొగుడి జోలికి వస్తే నీ అంతుచూస్తా, నటికి స్టార్ హీరో భార్య వార్నింగ్, సిగ్గుంటే ఆ ఫోటోలు?
స్యాండిల్ వుడ్ నటి పవిత్రా గౌడపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్యాండిల్ వుడ్ టాప్ హీరో, చాలెంజింగ్ స్టార్, డి బాస్ దర్శన్ భార్య విజయలక్ష్మి హెచ్చరించారు. విజయలక్ష్మి సోషల్ మీడియాలో భర్త దర్శన్, ఆమె కుమారుడు వినీత్‌తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. ఇది మనము, మా కుటుంబం అని ట్యాగ్ చేసింది. దీని ద్వారా నటుడు దర్శన్ భార్య మా కుటుంబమే సర్వస్వం అనే సందేశాన్ని ఇచ్చింది.
దీనికి తోడు ఇప్పుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మరో పోస్ట్ ద్వారా పవిత్రా గౌడను డైరెక్ట్ గా హెచ్చరించింది. దర్శన్ భార్య విజయలక్ష్మి నుంచి వార్నింగ్ వచ్చిన వెంటనే ఆయన కాపురంలో మరోసారి కలహాలు మొదలైనాయని చర్చలు మొదలైనాయి. కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి తన కుటుంబం ఫోటోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే కన్నడ నటి పవిత్రా గౌడ కూడా దర్శన్‌తో కలిసి తీసుకున్న చాలా ఫోటోలను కలిపి ఒక వీడియో తయారు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'మా సంబంధం మొదలైయ్యి 10 ఏళ్లు గడిచిపోయిందని పవిత్రా గౌడ పోస్టు చేసింది. మా సంబంధం ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే కలిసి సంతోషంగా వెళ్లాలి అని పవిత్రా గౌడ క్యాప్షన్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇలా పవిత్రా గౌడ తనకు, దర్శన్‌కు సంబంధించిన చాలా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే సమయంలో పై విదంగా హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్రా గౌడకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

పవిత్రా గౌడ దర్శన్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అల్లకల్లోల సృష్టించింది. ఇప్పుడు దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియాలో చేసి పోస్టు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ మహిళకు బుద్ధి ఉంటే ఆమె మరో మహిళ భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయదని విజయలక్ష్మి ఘాటుగా పోస్టు చేసింది. ఇలాంటి చర్యలకు ఆమె నైతికత, ఆదర్శాలు, బాధ్యతలు ఏమిటో ఇతరులకు చూపిస్తుందని, అలాంటి వాళ్లకు బుద్ది వచ్చేలా చేస్తానని దర్శన్ భార్య విజయలక్ష్మి నటి పవిత్రా గౌడకు వార్నింగ్ ఇచ్చింది.
ఖుషీ గౌడ అనే అమ్మాయి పవిత్ర, సంజయ్ సింగ్ దంపతుల కుమార్తె అని ఈ ఫోటోలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. నేను సాధారణంగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి సోషల్ మీడియాను ఉపయోగించను. కానీ ఇప్పుడు నా కుటుంబ ప్రయోజనాల కోసం, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా స్వరం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపింది. సమాజానికి రాంగ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పవిత్రా గౌడను దర్శన్ భార్య విజయలక్ష్మి హెచ్చరించారు.
దర్శన్ జీవితంలో మళ్లీ తుపాను మొదలైయ్యిందని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే నటుడు దర్శన్ జీవితంలో మళ్లీ తుఫాను వచ్చిందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో కూడా దర్శన్, విజయలక్ష్మి దంపతుల మధ్య ఇలాంటి గొడవలే జరిగాయి. ఆ సమయంలో రెబల్ స్టార్ అంబరీష్ దర్శన్ దంపతుల మధ్య రాజీ చేశారు. అయితే ప్రస్తతం అంబరీష్ ప్రాణాలతో లేకపోవడంతో మరోసారి రాజీ చేసేవాళ్లు కరువు అయ్యారని తెలిసింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో పాటు హీరో దర్శన్ భార్య విజయలక్ష్మికి అనుకూలంగా, వ్యతిరేకంగా చర్చలు జరుగుతున్నాయి.
హీరో దర్శన్ ఆయన నటించి ఇటీవల విడుదలైన కాటేరా సినిమా సుమారు 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఇప్పటికే ఘనంగా సక్సస్ మీట్ టు జరుపుకున్నారు. తమ అభిమాన నటుడు దర్శన్ నటించిన చిత్రం కాటేరా చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే విధంగా కటేరా సినిమా కన్నడ సినీ రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించింది. సినిమా విడుదల అయిన కొద్ది రోజుల్లోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాల్లో మొదటి స్థానం కూడా కాటేరా సినిమా దక్కించుకుంది. కటేరా రూ. 250 కోట్ల క్లబ్ లో చేరడానికి కొద్దిరోజులే మిగిలి ఉంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications