"ఛావా" రికార్డ్ కలెక్షన్స్.. అదొక్కటే మైనస్..

"యూరీ సర్జికల్" స్ట్రైక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆ తర్వాత "సర్ధార్ ఉద్దమ్", "సామ్ బహదూర్" లాంటి సందేశాత్మక చిత్రాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. తాజాగా విక్కీ కౌశల్ నటించిన చిత్రం "ఛావా". ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన తొలిరోజే రూ. 31 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా "ఛావా" నిలిచింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ "స్కై ఫోర్స్" మూవీ రూ. 15.30 కోట్లు రాబట్టి ఇప్పటి వరకు తొలి స్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ఆ ప్లేస్ ను "ఛావా" అధిగమించింది.

ప్రీ బుకింగ్స్ లోనూ..

అటు ప్రీ బుకింగ్స్ లోనూ "ఛావా" మూవీ రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్ కు ముందే దాదాపు 5 లక్షల టికెట్లు బుక్ అయినట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తాము సంతోషంగా ఉన్నామని.. ఈ మేరకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు ఈ మూవీపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కాయి. ఈ హిస్టారికల్ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, యేసుబాయి పాత్రలో రష్మిక మెప్పించారని.. ఆన్ స్క్రీన్ పై విక్కీ, రష్మిక కెమిస్ట్రీ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని ట్వీట్స్ చేస్తున్నారు.

Chhaava Sets Box Office on Fire with Rs 31 Crores on First Day of Release

అదొక్కటే మైనస్..

ఇక మహారాష్ట్రను పాలించిన శివాజీ మహారాజు కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉటేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీగా నటించారు. ఆయన సతీమణి ఏసుభాయి గా నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్‌ ఖన్నా మెరిశారు. అయితే సినిమాలో విక్కీ నటన, వార్, యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేఖర్. అయితే బలమైన కథ లేకపోవడం, కొంచెం డ్రామాగా సినిమా సాగడం కొంత సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+