పవన్ కల్యాణ్‌తో మాట్లాడు బావా!!
తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడటంతో కొన్ని రోజులకే సినీ ప్రముఖులంతా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి టికెట్ ధరల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చిచెప్పడంతో ప్రముఖులంతా ఖంగుతిన్నారు. ప్రభుత్వాన్ని బతిమలాడి ఏదోఒకరకంగా అనుమతులు తెచ్చుకోవచ్చులే అనుకున్నవారందరికీ షాక్ తగిలినట్లైంది. ఆ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాలేదు. ఆయన మర్యాదకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి రావొద్దన్నారని వార్తలు వచ్చాయి.
పవన్ కల్యాణ్ తో మాట్లాడు బావా..
సమావేశం జరిగిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ చిరంజవిని కలిశారు. సమావేశం వివరాలు తెలియజేశారు. అప్పటికే అల్లు అర్జున్ చేసిన పనిపై చిరంజీవి కొంత ఆగ్రహంగా ఉన్నారు. జనవరి 10వ తేదీన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. మేలో తన సినిమా విశ్వంభర విడుదల కాబోతోంది. ఇటువంటి తరుణంలో టికెట్ ధరల పెంపు లేకపోవడం అనేది నష్టంగా భావిస్తున్నారు. దీనిపై అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారు. నువ్వే చొరవ తీసుకొని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని, పవన్ కల్యాణ్ తో మాట్లాడితే అక్కడ పెంపు ఉంటుందన్నారు. అయితే దీనికి చిరంజీవి నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి జరిగింది చాలన్నారు.

చంద్రబాబునాయుడు సానుకూలంగా లేరని తెలిసింది
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవితోపాటు పెద్దలంతా వెళ్లి టికెట్ ధరల పెంపుకోసం ఆయన్ను బతిమలాడారు. ఇప్పుడు మళ్లీ నీకోసం నా తమ్ముణ్ని అడగలేనని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా లేరని తెలుస్తోందని, ఇటువంటి తరుణంలో కలిసినా ఉపయోగం ఉండదని అరవింద్ కు చెప్పారు. ఏదైతే అది జరుగుతుందని, నువ్వు మాట్లాడాలనుకుంటే వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిసి మాట్లాడమని సలహా ఇచ్చారు. తాను మాత్రం మాట్లాడేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో అల్లు అరవింద్ తిరిగి వెళ్లిపోయారు. దాదాపుగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చే అవకాశాలు కనపడటంలేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications