'పెద్ది'లో అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ రీక్రియేట్..??
సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ కరువులో మునిగిపోయింది. పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' మూవీపైనే ఉంది. పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. రామ్ చరణ్ పెద్ది హిట్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తారని అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అద్దిరిపోయాయి. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇక సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అటు చిత్ర యూనిట్ తోపాటు మెగా ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెద్ది సినిమా ప్రొమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ పెద్ది కా ఆవాజ్ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దాంతో పెద్ది టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇక పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1 న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే పెద్ది మూవీ ఆల్బమ్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. చికిరి.. చికిరి సాంగ్, రయ్ రయ్ రారా, హల్లోలల్లో, మస్సా మస్సా ఇలా ప్రతీ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ అయిన అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ ను రీ క్రియేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని ఈ పాటకు రామ్ చరణ్, జాన్వీ కపూర్ స్టెప్పులేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదల కానుంది. పెద్ది లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications