'పుష్ప-2'పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..మన మనిషి కాదని అంటూ

మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సెలైంట్‌గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు.అలాగే ఆయన నటించిన పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంపై కూడా ఎవరూ మాట్లాడలేదు. తాజాగా పుష్ప-2 హిట్‌పై చిరంజీవి మౌనం వీడారు.

chiranjeevi interesting comments on pushpa-2

విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి పుష్ప-2పై కీలక వ్యాఖ్యలు చేశారు.దీనిపై చిరంజీవి మాట్లాడుతూ..అభిమానం వేరు, వ్యక్తిగతం వేరు. ఓ వ్యక్తి మన మనిషి కాదని, దూరం పెట్టడం సరి కాదని చిరంజీవి వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో హీరోలంతా ఒకటే అని, ఇండస్ట్రీలో అందరూ ఒకటే అని మేసేజ్‌ని ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదంటూ హీరోలకు హితవు పలికారాయన. అలాగే 'పుష్ప 2' సినిమా పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తానని. ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలని చిరంజీవి కోరారు.ఓ సినిమా హిట్ అయితే టే ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+