'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి రివ్యూ: ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుంది..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది'. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే పెద్ది చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రిలీజ్ కు 15 రోజులే ఉన్న క్రమంలో "పవర్ ప్లే టూర్" పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేసింది. ఇక మే 18 ముంబైలో గ్రాండ్ గా పెద్ది అఫీషియల్ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దాంతో సినిమా రిలీజ్ కు ముందే ట్రైలర్ రిలీజ్ పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ది మూవీ ట్రైలర్ చూశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
" పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్.. 3 నిమిషాలు..PURE FIREPOWER PACKED TRAILER!!చరణ్.. బుచ్చి.. రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుందీ ఈ ట్రైలర్. Emotion.. Elevation.. Madness.. అన్నీ next level లో ఉన్నాయి! అన్నట్టు... చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు." Sorry బుచ్చి బాబు.. చూసాక కంట్రోల్ తప్పా!" అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

ఇక ఇప్పటికే పెద్ది టీజర్, గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్, రయ్ రయ్ రారా సాంగ్స్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు చిరంజీవి ట్వీట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 2న హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications