జూనియర్ ఎన్టీఆర్ - రామ్‌చరణ్ మధ్య విభేదాలు?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేశారు. అప్పటికే స్నేహంగా ఉన్న వీరిద్దరూ ఆ సినిమా సమయంలోను, సినిమా తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి కథలు మరొకరు చెప్పుకోవడం, అభిప్రాయాలు తీసుకోవడం, వాటిని సినిమాల్లో అమలుపరచడం లాంటివి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరూ గ్లోబల్ హీరోలుగా మారారు. అయితే ఈ సినిమా సమయంలో తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అంటూ అభిమానులు వాదులాడుకున్నారు.

ఎన్టీఆర్ ను కొనియాడిన విజయేంద్రప్రసాద్
ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ జూనియర్ పాత్రను అద్భుతంగా కొనియాడారు. దీనిపై ఎన్టీఆర్ కేవలం సహ నటుడేనని, ప్రధాన హీరో కాదంటూ రామ్ చరణ్ అభిమానులు ట్రోలింగ్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారక్, చరణ్ మధ్య స్నేహం చెడిందంటున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవర ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. చరణ్ కనీసం దీనికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదంటున్నారు. అంతేకాకుండా సినిమా విడుదలయ్యే రోజున నగరంలో ఉండకుండా బయటకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

clashes between junior ntr and ramcharan details here

అవన్నీ అవాస్తవాలే
బాలయ్య 50వేళ్ల వేడుక జరిగిన సమయంలో కూడా ఎన్టీఆర్ హైదరాబాద్ లో లేరు. తన తల్లి, భార్య, పిల్లలతో కలిసి కర్ణాటకలోకి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఈ సందర్భంతో పోలుస్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అంటూ విశ్లేషకులు కొట్టేస్తున్నారు. ఐఫా అవార్డుల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ అబుదాబి వెళుతున్నారు. అక్కడ 27 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 28వ తేదీన అవార్డుల ప్రదానం ఉంటుంది.

షారుక్ ఖాన్, కరణ్ జోహార్ హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. రామ్ చరణ్ ఐఫా అవార్డుల్లో పాల్గొంటున్నట్లు అతని పీఆర్ టీం వెల్లడించడంతో తారక్, చరణ్ మధ్య ఉన్న విభేదాలు అవాస్తవాలేననే విషయం మరోసారి స్పష్టమైందని అభిమానులు అంటున్నారు. తాజాగా దసరా సినిమాలో నటించిన నాని ఉత్తమ నటుడిగా, కీర్తి సురేష్ ఉత్తమ నటిగా, ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి సైమా అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+