మహేష్ బాబు - మైత్రీ మూవీ మేకర్స్ వివాదం... ఏం జరిగింది?
ఘట్టమనేని మహేష్ బాబు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చుకానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రం చేస్తున్నారు. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్నారు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతోపాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పరిశ్రమలో మహేష్ బాబుకు, మైత్రీ మూవీ మేకర్స్ కు అవినాభావ సంబంధాలున్నాయి. అయితే కొద్దిరోజులుగా మహేష్ బాబుకు, మైత్రీ మూవీవారికి తేడాలొచ్చాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్కారువారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీవారే నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే లీకుల బెడద ఎదుర్కొంది. సినిమా విడుదలకు ముందు కూడా డిజాస్టర్ ఎస్వీపీ అనే పేరుతో సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండైంది. లీకుల విషయంలోను, ఈ ట్యాగ్ ట్రెండింగ్ విషయంలో నిర్మాతలు సరైన చర్యలు తీసుకోలేదని మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు తొలిరోజే నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ సూపర్ స్టార్ ఇమేజ్ తోపాటు వేసవి సెలవులు కలిసిరావడంతో బయటపడింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు మైత్రీ మూవీ మేకర్స్ మహేష్ బాబు సినిమా విషయంలో కఠినంగా ఉండలేకపోయిందని, లీకులు వచ్చినా మిన్నకుండిపోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేసే చిత్రం రాజమౌళిది.. దీన్ని డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. మైత్రీవారికి ఎట్టి పరిస్థితుల్లోను సినిమాలు చేయవద్దని, ఆ బ్యానర్ నిర్మించే ఇతర చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, ఇతర వేడుకలకు హాజరుకావొద్దంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications