జానీ మాస్టర్‌పై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైనట్టు సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ డ్యాన్స్‌కు సంబంధించిన గ్రూపులో సతీష్ అనే డాన్సర్ మెంబర్‌గా ఉన్నాడు.ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.

ఆయన ఆలా చేయడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో జానీ మాస్టర్‌పై హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దీనిపై సతీష్ మాట్లాడుతూ...మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ. 5 కోట్లతో ఓ స్థానం కొనుగోలు చేశామని..అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడిందని సతీష్ చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని, అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఆయన్ను ఎన్నుకొన్నారని సతీష్ తెలిపారు.

Complaint to Pawan Kalyan in Johnny Master

కానీ ఆయన ఏ విధంగానూ ఉపయోగపడింది లేదని సతీష్ తెలిపారు. దీనిపై సతీష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంపై జానీ మాస్టర్ స్పందించారు. నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నికలో కోడ్ వచ్చిందని..అప్పుడే రంజాన్ స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో నేను ఎలాంటి పాటలు వినను..పాటలు కంపోజ్ కూడా చేయను. నెల రోజు ఉపవాసం చేస్తానని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

హెల్త్ ఇన్యూరెన్ గురిని రామ్ చరణ్, ఉపాసనలతో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టామని జానీ మాస్టర్ తెలిపారు. మా అసోసియేషన్‌లోకి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా.. డబ్బులు ఇచ్చి అదుకున్నానని.ఒకరి పొట్టకొట్టడం నాకు తెలియదని జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు రాకూడదనే బయటకు వచ్చి వివరణ ఇస్తున్నానని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+