చిరంజీవి పౌరసత్వంపై వివాదం!
మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారో అప్పటి నుంచి వివాదాల్లోనే ఉంటున్నారు. వాటితోనే సహవాసం చేస్తున్నారు. రాజకీయాలు వద్దనిచెప్పి సినీ పరిశ్రమకు తిరిగి వచ్చేసినప్పటికీ అన్నిచోట్లా రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో రెండు సినిమాలు మినహా అన్ని సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. తన తోటి హీరోలు బాలయ్య, వెంకీ దూసుకుపోతుండగా, చిరంజీవి, నాగార్జున వెనకబడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు మూల స్తంభాలుగా నిలబడ్డ ఈ నలుగురిలో ప్రస్తుతం బాలయ్య అగ్రస్థానంలో ఉన్నారని చెప్పొచ్చు.
ఊపిరి ఉన్నంతవరకు భారతీయుడినే
ఇటీవలే మనవడు కావాలని, అలాగే తమ ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంటుందని, తాను వార్డెన్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాల్లో చిక్కుకున్నాయి. తాజాగా చిరంజీవి పౌరసత్వం కూడా వివాదంలో చిక్కుకుంది. ఆయన భారతీయ పౌరుడు కాదంటూ కొద్దిరోజులుగా వివాదం నెలకొంది. చిరుకు యునైటెడ్ కింగ్ డమ్ పౌరసత్వం ఉంది. అది రద్దు చేయాలంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చిరు పీఆర్ టీం ఆయనకు యూకే పౌరసత్వం లేదని, ఊపిరి ఉన్నంతవరకు భారతీయుడిగానే జీవిస్తానన్నారని చెప్పింది.

పని కట్టుటకొని దుష్ప్రచారం చేస్తున్నారు
చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఇచ్చి సత్కరించింది. ఇటువంటి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని మెగా అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఆయన సరదాగా మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారని, వాటిని సరదాగానే తీసుకోవాలని, కానీ ట్రోలర్స్ కొందరు, మెగాస్టార్ కు వ్యతిరేకంగా ఉండేవారంతా పనికట్టుకొని ఆయన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు.
ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్న చిరు తన తర్వాత చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేయనున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి కారణం అవి నాసిరకంగా రావడమే అంటున్నారు.












Click it and Unblock the Notifications