'OG' టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ.. ఇలాంటి పరిస్థితి వచ్చిందా..?

సాధారణంగా సినిమాలకు ప్రమోషన్లు కొత్తేమీ కాదు. టికెట్ రేట్లు తగ్గించడం, 1+1 ఆఫర్లు ఇవ్వడం చూశాం. కానీ, ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమాకు ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ మూవీ 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్లతో మొదలుపెట్టి, తొలిరోజు ఏకంగా రూ. 154 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే, ఆ తరువాత రోజు రోజుకీ కలెక్షన్లు పడిపోతుండటంతో చిత్ర బృందం టికెట్ కొంటే బిర్యానీ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

Controversy Over Pawan Kalyan s OG Promotion Free Biryani Offer Sparks Debate on Star Power

జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో OG టికెట్ కొనుగోలు చేస్తే, ప్రముఖ ప్యారడైజ్ (Paradise) రెస్టారెంట్ నుండి మినీ బిర్యానీ ప్యాక్ ఉచితంగా పొందవచ్చని ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి 'ఆహార ఆఫర్' ఇవ్వడంపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా బాబు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినా థియేటర్లకు క్యూ కట్టే అభిమానులు ఉండేవారు. అలాంటిది, పూర్తి స్థాయి సినిమాకు ఇలాంటి ఆఫర్ పెట్టాల్సిన పరిస్థితి రావడం పవన్ కళ్యాణ్ క్రేజ్‌పై చర్చకు దారితీసింది.

సినిమాకు కంటెంట్ ఉంటే చాలు, హీరో ఎవరన్నది పట్టించుకోని ఆడియన్స్ వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందా? లేక ప్రమోషన్లలో భాగంగా ఈ వ్యూహం పన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూడాల్సి ఉంది. ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+