కుబేర నుంచి క్రేజీ అప్‌డేట్.. హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్
దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. ఆయన తీసినవి కొన్ని చిత్రాలే అయినా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయి ఉంటాయి. హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి, ఫిదా వంటి చిత్రాలే కాదు. మరెన్నో సినిమాలు అందించారు. ఇప్పడు తాజాగా మరో చిత్రంతో శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే కుబేర చిత్రం. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున కీలకమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఇక, ఈ చిత్రం గురించి మరో క్రేజ్ అప్‌డేట్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారట. ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్‌న్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జునతో పాటు ఇతర నటీనటులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కుబేర సినిమాకు సంబందించి ధనుష్, నాగార్జున లుక్స్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఏకకాలంలో మూడు భాషల్లో షూటింగ్..
శేఖర్ కమ్ముల చిత్రం అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. గతంలో రీలిజయిన ఫిదా చిత్రం ఎంతటి విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల చిత్రంలోని హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తుంటారు. ఇక, కుబేర చిత్రంలో రష్మిక హీరోయిన్ అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. జిమ్ సర్భ్ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో షూట్ చేయడం విశేషం..












Click it and Unblock the Notifications