షాకింగ్ న్యూస్: 'పుష్ప2' నుంచి ఆ పాట తీసేశారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.1650 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. మరో రూ.200 కోట్లు రాబడితే బాహుబలి2 పేరుమీద ఉన్న రికార్డును బద్ధలు కొట్టడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పటివరకు ఉన్న కలెక్షన్ల ప్రకారం, రాబోయే జనవరి 1 కలెక్షన్లు చూసుకుంటే తేలిగ్గానే ఈ రికార్డును పుష్ప2 అందుకోనుంది. కానీ ఈ సినిమా సాధించిన ఘనవిజయం తాలూకా ఆనందం అల్లు అర్జున్ కు లేకుండా పోయింది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిలాట కేసులో ప్రస్తుతం ఆయన పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. రేవతి భర్తకు పరిహారంతోపాటు సినీ పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని అల్లు అర్జున్ వైపు నుంచి హామీ వచ్చింది.
పాటలన్నీ హిట్ అయ్యాయి
ఈ సినిమాలో పాటలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించారు. పుష్ప2లో దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే పాట ఉంది. పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెకావత్ ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ పాటను తీశారు. అయితే ఈ పాటను యూట్యూబ్ నుంచి టీ సిరీస్ తొలగించింది. 24వ తేదీ సాయంత్రం నుంచి ఈ పాటను తీసేసింది. ఈ పాట సినిమాలో భాగంగా తీసినప్పటికీ పోలీసులను ఉద్దేశించే ఈ పాట అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరగడంతో వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ తొలగించింది.

మహారాష్ట్రలో కూడా నిరసనలు
మహారాష్ట్రలో షెకావత్ అనే పేరుతో ఇలా పాట తీయడంవల్ల కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మా వర్గాన్ని కించపరుస్తున్నారంటూ ఇప్పటికే ఆందోళనలు జరిగాయి. దీనివల్లే ఆ పాటను తీయాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ మంచి వ్యూస్ దక్కించుకున్న పాటను తొలగించడం బాగోలేదంటూ బన్నీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. ఆ కోర్టు బెయిలిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ బన్నీ అభిమానులతోపాటు సినీ ప్రియుల్లో నెలకొంది. బెయిలివ్వకపోతే ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications