దసరా నుంచి కొత్త 'దేవర'... థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.304 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమాను తారక్ తన భుజ స్కంధాలపై మోయగా, ఆయనకు తనవంతుగా అనిరుధ్ సాయం చేశాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించిందికానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా నిరాశకు గురయ్యారు.
జాన్వీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు
జాన్వీ సన్నివేశాలు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం. దీంతో జాన్వీకపూర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను దేవరలో యాడ్ చేయబోతున్నారు. అలాగే సినిమా విడుదలవడానికి ముందు దావూదీ పాట అందరినీ ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట పెద్ద సంచలనాన్ని సృష్టించింది. తీరా సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ వెతికినా ఈ పాట మాత్రం కనపడలేదు. ఎందుకు తీసేశారో అభిమానులకు అర్థం కాలేదు. ఎడిటింగ్ లో పాటను తీసేశారు. దసరా నుంచి దావూదీ పాటను కూడా యాడ్ చేయబోతున్నారు.

దావూదీ పాటను యాడ్ చేస్తున్నారు
విజయదశమి నుంచి జాన్వీ సన్నివేశాలతోపాటు దావూదీ పాట కూడా ఉండటంతో దేవరకు ఇంకా బాగా హైప్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దసరా ఎప్పుడు వస్తుందా? దావూదీ పాటను ఎప్పుడు చూద్దామా? అనే ఆత్రుతలో ఎన్టీఆర్ అభిమానులున్నారు. దీనిపై త్వరలోనే సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాబోతోంది. అక్టోబరు రెండు గాంధీ జయంతి కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని, తర్వాత నుంచి 12వ తేదీ వరకు వరుసగా విజయదశమి సెలవులు ఉండటంతో కలెక్షన్లకు ఇబ్బంది లేదని, సులువుగా దేవర బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications