Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బలగం డైరెక్టర్ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. "ఎల్లమ్మ"లో కొత్త హీరో ఫిక్స్ !!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు "వేణు". ముఖ్యంగా మున్నా, అతిధి సినిమాలు అతని కెరీర్ కి బాగా కలిసొచ్చాయని చెప్పాలి. ఆ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక రీసెంట్ గానే 'బలగం' చిత్రంతో దర్శకుడిగా మారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టడమే కాకుండా అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే వేణు తన నెక్స్ట్ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి "ఎల్లమ్మ" అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ప్రాజెక్టును అనౌన్స్ చేసి రెండేళ్లు గడుస్తుంది. బలగం లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీతో భారీ విజయం తర్వాత.. రెండో సినిమా ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాను ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు హీరో ఎవరనేది ఫిక్స్ కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

devisri-prasad-debut-as-hero-under-balagam-venu-direction

తప్పుకున్న పలువురు హీరోలు..

కాగా గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు. కానీ ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రంలో నితిన్‌ హీరోగా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అనూహ్యంగా నితిన్ 'తమ్ముడు' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం.. బడ్జెట్ సమస్యల కారణంగా నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతికి వెళ్లిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దేవీశ్రీ.. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కెరీరీలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటిన డీఎస్పీని హీరోగా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నా.. ఆయనకు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అది మాత్రం ఫిక్స్ అవ్వడం లేదు.

devisri-prasad-debut-as-hero-under-balagam-venu-direction

ఈ క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఇదేం ట్విస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉండగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాలని కోరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+