viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..??
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ధురంధర్-2' హవా నడుస్తోంది. ధురంధర్ మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ధురంధర్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే దేశవ్యాప్తంగా రూ. 102 కోట్లకుపైగా నెట్ వసూళ్లు నమోదు చేసింది. ప్రీమియర్ షోలు కలుపుకుంటే మొత్తం కలెక్షన్ల వివరాలు రూ. 145 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదలైన తొలి రోజే రూ. 100 కోట్ల నెట్ మార్క్ ను దాటిన తొలి హిందీ సినిమాగా ధురంధర్ 2 రికార్డు సృష్టించింది.
ధురంధర్ 2 మూవీ విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే రూ. 761 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో భారత్ లోనే రూ. 550 కోట్లు రావడం విశేషం. తొలి 2, 3 రోజులతో పోల్చితే నాలుగో రోజు భారీగా కలెక్షన్స్ పెరగడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఇక ఈ వారం చివరినాటికి రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఈ మూవీ చేరే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దేశవ్యాప్తంగా దిగ్గజ దర్శకులు, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా ధురంధర్-2 చూసిన ఓ పాకిస్థానీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో మెయిన్ విలన్ మేజర్ ఇక్బాల్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది పాకిస్థాన్ ఫ్యామిలీ.. అతనే తమ హీరో అని ప్రశంసిస్తోంది. అంతేకాక భారత్ లో శాంతికి విఘాతం కలిగించేలా తాము ఎల్లప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉంటామని పాకిస్థానీ ఫ్యామిలీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోను థియేటర్ బయట చిత్రీకరించారు. పాకిస్థాన్ లో జై కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్న విలన్ గా నటించగా.. ఆయన్ను సైతం పాకిస్థానీ ప్రజలు ప్రశంసించడం గమనార్హం. మొత్తానికి ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications