'ధురందర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..! ఫ్యాన్స్ కు నిజంగా గుడ్ న్యూస్..!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆధిత్య దర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల హవా సృష్టిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ. 1600 కోట్లకుపైగా భారీ వసూళ్లు రాబట్టి రూ. 2000 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డున్ని చెరిపేసిన ఈ మూవీ త్వరలోనే బాహుబలి 2, దంగల్ మూవీ రికార్డుల్ని దాటి భారత్ లోనే అత్యధిక కలెక్షన్లు సృష్టించిన సినిమాగా మారనుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు.. ధియేటర్లలో ఫుల్ రన్ తర్వాత అంటే దాదాపు 8 వారాల విండో తర్వాతే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ధురంధర్-2 మూవీ బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది. విడుదలై ఇన్ని రోజులైనా హౌజ్ ఫుల్ షోలతో కంటిన్యూ అవుతోంది. దాంతో ఈ మూవీని ఇప్పుడిప్పుడే ఓటీటీకి తీసుకురావడానికి మేకర్స్ తొందరపడటంలేదని తెలుస్తోంది.
ఇక ధురంధర్-2 సినిమా డిజిటల్ రైట్స్ ప్రస్తుతం జియోహాట్ స్టార్ వద్ద ఉన్నాయి. అలాగే ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ హవా నడుస్తోంది. ఈ సమయంలో రిలీజ్ చేస్తే పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఐపీఎల్ లీగ్ 2026 ముగిసిన తర్వాతే ధురంధర్-2 సినిమాను ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన ఈ మూవీ మే చివరివారం లేదా జూన్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ధురంధర్-2 సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటుగా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, మాధవన్ తమ పాత్రలను అద్భుతంగా పండించారు. ధురంధర్-1 మూవీ 2025లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసందే. ఇక రెండో భాగం అంతకు మించి విజయం సాధించింది. అలా రణ్ వీర్ సింగ్ స్టార్ హోదాను మరో స్థాయికి తీసుకు వెళ్లిన సినిమాగా ధురంధర్-2 నిలిచింది.












Click it and Unblock the Notifications