ప్రభాస్ అంటే పడదా? ఇంతవరకు నోరెత్తని స్టార్ హీరోయిన్!
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రాన్ని చేస్తున్నారు. మారుతి దీనికి దర్శకుడు. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రం చేస్తున్నారు. ఇది రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తోంది. దీనితర్వాత కల్కి2, సలార్2 చిత్రాలు చేయాల్సి ఉంది. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాం అనగానే ఆ సినిమాలో నటించే నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులు కూడా ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే వారిపై ప్రభాస్ చెప్పలేనంత ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమను వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు.
తనకు అలాంటి కొడుకుంటే బాగుండేది
తాజాగా నటి జరీనావహాబ్ తనకు ప్రభాస్ లాంటి కొడుకుంటే బాగుండేది అని వ్యాఖ్యానించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభాస్ సినిమాల్లో నటించిన ఎంతోమంది హీరోయిన్లు డార్లింగ్ గురించి గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడుతూనేవుంటారు. సమయం అనేది తెలియకుండా అలా చెబుతూనే ఉంటారు. అలాగే ఇంటిదగ్గర నుంచి తెప్పించే భోజనం గురించి కూడా చెబుతారు. అంతగా ప్రభాస్ ను అందరూ ఇష్టపడతారు. ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ మాత్రం ఇంతవరకు ప్రభాస్ గురించి నోరు తెరిచి మాట్లాడలేదు. ఏనాడూ పొగడలేదు. అసలు ఆయన అనే వ్యక్తి ఉన్నాడు అనేవిధంగా కూడా ఏనాడూ ప్రవర్తించలేదు. దీనికితోడు ఆ హీరోయిన్ డార్లింగ్ పక్కన ఓ సినిమా కూడా చేసింది.

మాటవరుసకు కూడా ప్రభాస్ పేరు ఎత్తలేదు
ఆమె ఎవరో కాదు.. పూజాహెగ్డే. డార్లింగ్ తో కలిసి రాధేశ్యామ్ సినిమా చేసింది. అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా చేసే సమయంలో కాల్టీట్లకు సంబంధించి నిర్మాతలతో పూజాకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నిర్మాతలతో చిన్నపాటి ఇబ్బందులే తలెత్తాయి. ఆ నిర్మాతలు డార్లింగ్ కు బాగా కావల్సినవారు. దీంతో అటు వారికీ చెప్పలేకపోయాడు.. ఇటు పూజాకు చెప్పలేకపోయాడు. దీంతో అప్పటినుంచి ఆ టీంతో పూజాహెగ్డే దూరంగా ఉంటూ వస్తోంది. ప్రభాస్ కూడా తనకు మద్దతుగా మాట్లాడలేదు అనే బాధ తన మనసులో ఉందేమో తెలియదుకానీ ఈరోజు వరకు ఎక్కడా, ఎప్పుడూ, ఏ ఇంటర్వ్యూలో కూడా ఆమె ప్రభాస్ పేరు కూడా ఎత్తలేదు. మాటవరుసకు కూడా ఆమె డార్లింగ్ గురించి మాట్లాడులేదు.












Click it and Unblock the Notifications