26 ఏళ్ల నుంచి టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తున్న సాంగ్

ఒక సినిమాలో పాట విడుదలైతే నెల, మూడు నెలలు, ఆరు నెలలు ట్రెండింగ్ లో నిలుస్తుంటాయి. చాలా చాలా బాగుందంటే సంవత్సరం నిలుస్తుంది. కానీ ఏకంగా 26 సంవత్సరాల నుంచి టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్న పాట ఉంది. అదేమిటంటే.. షారుక్ ఖాన్, మనీషా కోయిరాలా జంటగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దిల్ సే చిత్రంలోని పాట. జియా జిలే అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే నిలుస్తోంది. ఈ పాటను గుల్జార్ రాయగా, ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు. దిల్ సే చిత్రంలో అన్ని పాటలు సూపర్ హిట్. జియాజిలే పాటైతే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినీ ప్రియులంతా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలను ఆస్వాదిస్తుంటారు.

ప్రీతిజింటా మొదటి సినిమా
1998లో దిల్ సే విడుదలైంది. జియా జిలే పాటలో ప్రీతిజింటా నటించింది. ఈ సినిమాలోని ఈ పాట తమిళంలో నెంచినీలే నెంచినీలే అని పాపులర్. హిందీలో జియాజిలే అని పాపులర్. పెళ్లికూతురి మనసులో ఉండే భావాలను వ్యక్తీకరించేందుకు ఆయన ఈ పాట రాశారు. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క పదం కూడా ఎక్కడా అసభ్యకరంగా ఉండదు. అదే ఈ పాట, గుల్జార్ గొప్పదనం. దాన్ని దగ్గరుండి రాయించుకున్న మణిరత్నం గొప్పదనం. ఇందులోని ప్రతి పంక్తి అనేక భావాలను వ్యక్తపరుస్తుంది. సాహిత్య ప్రియులైతే ఈ పాట అంటే చెవికోసుకుంటారు.

dil se movie song jiya jile has been trending for 26 years

అద్భుతమైన సంగీతాన్ని అందించిన రెహమాన్
రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. గుల్జార్ రాసిన పాటలపై పుస్తకం రాసిన నష్రీన్ మున్నీ కబీర్ ఈ పాట గురించి మాట్లాడుతూ పెళ్లికూతురి మనసులో ఉండే భావాలను అద్భుతంగా రావారని, దీన్ని తెరపై చూపించిన విధానం కూడా అద్భుతమని కొనియాడారు. ఈ సినిమాతోనే ప్రీతిజింటా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ పాట ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. మణిరత్నం తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. దిల్ సేలోని అన్ని పాటలు అద్భుతంగా కుదిరాయని, అలా ఎప్పుడో కానీ జరగదని మణిరత్నం అన్నారు. ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమాకు రెహమాన్ నే సంగీత దర్శకుడిగా తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+