క్రిష్ రెండో భార్యను చూశారా? బ్యాగ్రౌండ్ తెలుసా?
విభిన్న ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). ఆ పేరుకన్నా క్రిష్ అనే పేరుతోనే ప్రాచుర్యం పొందారు. తన సినిమాలు కూడా అటు అవార్డులను సాధించిపెడతాయి.. ఇటు రివార్డులను సాధించిపెడతాయి. ఒకటి రెండు సినిమాలు మినహా కమర్షియల్ గా విజయాలు సాధించిన సినిమాలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే ఆయన వివాహం చేసుకోగా, ఏడాదికి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆయన రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు ప్రీతిని ఈనెల 10వ తేదీన మనువాడబోతున్నారు.
ఒంటరి జీవితం గడుపుతున్న క్రిష్
10వ తేదీన పెళ్లి చేసుకున్న తర్వాత 16వ తేదీన రిసెప్షన్ గ్రాండ్ గా ఇస్తున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ పరిశ్రమకు చెందిన వివిధ ప్రముఖులంతా హాజరవుతున్నారు. 2016లోనే ఆయన రమ్య అనే డాక్టర్ ను హైదరాబాద్ లోనే మనువాడారు. ఇప్పుడు చేసుకోబోయే ఆమె కూడా వైద్యురాలే అవడం గమనార్హం. 2018లో కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత అప్పటి నుంచి క్రిష్ ఒంటరి జీవితం గడుపుతున్నారు. సాధారణంగా సినీ పరిశ్రమకు చెందినవారు దాదాపుగా అదే పరిశ్రమలో ఉన్నవారినే వివాహాలు చేసుకుంటారు. అయితే క్రిష్ మాత్రం రెండుసార్లు వైద్యురాళ్లతోనే ప్రేమలో పడటం విశేషం. తన వృత్తికి సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్
పవన్ కల్యాణ్ తో మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ రావడంతో ఆయన దాన్నుంచి తప్పుకున్నారు. దీంతో మిగతా భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ అనుష్క ప్రధాన పాత్రలో ఘాటీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ సంచలనం కలిగించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కలిపి పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. 2025 ఫిబ్రవరి లేదంటే మార్చిలో ఘాటీ సినిమాను విడుదల చేయడానికి ప్రణాళిక రచిస్తున్నారు. దీనితర్వాత ఆయన మరో పాన్ ఇండియా సబ్జెక్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అది కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని, నటీనటులు ఖరారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications