వెయ్యి జన్మలెత్తినా ఆ సినిమాకు సీక్వెల్ రాదు!

ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ బాగా నడుస్తోంది. అప్పటికే హిట్ అయిన సినిమాలను తిరిగి విడుదల చేయడంతోపాటు వాటికి సీక్వెల్ గా మళ్లీ ఇంకొక సినిమాను తెరకెక్కించడం అనేది మనం గమనిస్తున్నాం. స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలకు రీమేక్ కావాలంటూ డైరెక్టర్లను డిమాండ్ చేస్తున్నారు .

తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృష్ణవంశీ దర్శకత్వంలో తమ హీరో నటించిన "రాఖీ" సినిమాకు సీక్వెల్ కావాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు . దీనికి స్పందించిన డైరెక్టర్ కృష్ణవంశీ ..1000 జన్మలెత్తినా రాఖీ సినిమాకి సీక్వెల్ రాదని, రాఖీ అనే పేరుతో ఒక సినిమానే ఉంటుందన్నారు. అది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, పదే పదే ఆ సినిమాలకు సీక్వెల్ తీసి సినిమా పేరుని చెడగొట్టమని స్పష్టం చేశారు.

director krishna vamsi comments on rakhi movie sequel

కృష్ణవంశీ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఆయన చెప్పింది నిజం. కొన్ని కొన్ని సినిమాలకు సీక్వెల్స్ అస్సలు బాగోవని, ఉన్న పేరును చెడగొట్టుకోవడమేకానీ వాటికి సీక్వెల్స్ తీయకుండా ఉండటమే మంచిదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాఖీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన సినిమా మొత్తానికి హైలైట్. ఛార్మి, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చెల్లెలు సెంటిమెంట్ ఆధారం తెరకెక్కింది.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడదల చేయడమేకాదు.. రెండు భాగాలుగా నిర్మించబోతున్నారు. దేవర 1 చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత తారక్ కాల్షీట్లను బట్టి దేవర2 చిత్రానికి దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+