రూ.వెయ్యి కోట్లు ఇస్తానన్నా ఆ హీరోను తీసుకోను: రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకువచ్చాడు. ఆ తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టడమే కాదు ఆస్కార్ అవార్డును కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ రూ.1500 నుంచి రూ.1700 కోట్ల బడ్జెట్ లో దీన్ని నిర్మించబోతున్నారు.

ప్రపంచంలో ఇంతవరకు తెరకెక్కని రీతిలో
ప్రపంచ సినిమా తెరపై ఇంతవరకు రాని రీతిలో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి చేసిన మగధీర సినిమా నేటికి 15 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమా చేసే సమయంలోనే తాను రూపాయిని జాగ్రత్తగా ఎలా ఖర్చుపెట్టాలి? ప్రొడక్షన్ బృందానికి ఎంత ఖర్చవుతోంది? ఒక సెట్ వేస్తే అందుకు ఎంత ఖర్చు చేయాలి? భారీ సినిమాలు చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి.. తదితర విషయాలను నేర్చుకున్నట్లు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వివరించారు. తెలుగులో అంత భారీ బడ్జెట్ తో అప్పటివరకు ఏ సినిమా రాకపోవడంతో ప్రతి అడుగు ఆచితూచి వేసినట్లు చెప్పారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా రికార్డులను తిరగరాని రామ్ చరణ్ కు స్టార్‌డమ్ సంపాదించిపెట్టింది.

director Rajamouli talked about the selection of actors in his film

కథ ప్రకారమే నటులు ఎంపిక జరుగుతుంది
తాను రాసుకున్న కథ ప్రకారమే నటీనటులను ఎంపిక చేసుకుంటానని, అందుకు ఎవరైతే బాగుంటారనేది ముందుగానే కొంత అవగాహన కలుగుతుందని, ఆ ప్రకారమే వారి ఎంపిక జరుగుతుందన్నారు. కథకు సరిపోతారు అనుకుంటే వారికి గతంలో పది ఫ్లాపులొచ్చాయా? అందంగా ఉంటారా? లాంటి విషయాలను పట్టించుకోను అని రాజమౌళి స్పష్టం చేశారు. ఒకవేళ ఫలానా హీరో సరిపోతారు.. అతన్ని తీసుకుందామంటూ నిర్మాత చెప్పినా, ఆ హీరోకానీ, నిర్మాతకానీ రూ.వెయ్యి కోట్లు ఇస్తానన్నా ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోనన్నారు. మగధీర సినిమాతోనే తాను సినిమాల గురించి ఎంతో నేర్చుకున్నానని, యమదొంగ సినిమావల్ల తాను జానపద చిత్రాలతోపాటు పౌరాణిక చిత్రాలు కూడా చేయగలననే నమ్మకం కలిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+