ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్ వద్దకు: తెర వెనక రాజకీయం?
సినీ పరిశ్రమలో సహజంగా ఒక హీరోతో చేయాల్సిన సినిమా మరో హీరోతో పట్టాలెక్కడం జరుగుతుంటుంది. కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతోనో లేదంటే కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాలవల్ల ఒక హీరో నుంచి మరో హీరో వద్దకు కథలు మారుతుంటాయి. అలా మారినవాటిలో కొన్ని సూపర్ హిట్లు అవుతుంటాయి.. మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్ తో ఓ సినిమా చేద్దామని కథను సిద్ధం చేసుకోవడంతోపాటు సినిమాకు కావల్సిన అన్ని హంగులు సిద్ధంగా ఉంచుకున్నాడు. కానీ హఠాత్తుగా ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లింది. దీనివెనక పెద్ద రాజకీయం నడిచిందంటారు.
దర్శకుడిపై తారక్ మేనేజర్ ఒత్తిడి
అతనొక్కడే సినిమా చేసిన తర్వాత సురేందర్ రెడ్డి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ప్రభాస్ తో చేద్దామనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ సురేందర్ రెడ్డిని కలిసి తారక్ తో ఓ సినిమా చేయాలని కోరారు. తాను ప్రభాస్ తో సినిమా చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నానని చెప్పినప్పటికీ సురేందర్ రెడ్డిపై తారక్ మేనేజర్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. అప్పటికి తారక్ కూడా స్టార్ హీరోనే కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక సినిమా చేయడానికి దర్శకుడు ఓకే చెప్పారు. దీంతో ప్రభాస్ తో చేయాల్సిన సినిమా వాయిదా పడింది. ప్రభాస్ తో చేయాల్సిన కథ అశోక్ సినిమానా? మరో కథా? అనేది తెలియదుకానీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ విషయాలన్నీ చెబుతూ అది వేరు.. ఇది వేరు అని చెప్పారు.

డిజాస్టర్ గా నిలిచిన అశోక్
అశోక్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అశోక్ ఎందుకు తీయాల్సి వచ్చింది అనే విషయాన్ని చాలాకాలం తర్వాత సురేందర్ రెడ్డి వెల్లడించారు. తనకిష్టం లేకపోయినా వారుచేసిన బలవంతంతోనే సినిమా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తాను ఏ విషయం చెప్పకముందే తారక్ మేనేజర్ ఎన్టీఆర్ తో ఏ సినిమా చేద్దాం?, ఏ కథ అనుకుంటున్నారు? ఎవరెవర్ని తీసుకుందా? ఎక్కడ షూటింగ్ చేద్దామంటూ అన్నీ మాట్లాడేశాడని, దీంతో ఆ సినిమా చేయాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి తెలిపారు. వాస్తవానికి సురేందర్ రెడ్డి వెనక తారక్ మేనేజర్ పడ్డాడా? లేడా? అనేది తెలియదు. కానీ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేయడంతో నిజమే అనుకోవాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications