తాత పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరూ ఎన్టీఆర్ అయిపోలేరు

విశ్వ విఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా ఆయన రూపురేఖలతో, ఆయన పేరుతో పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ తన కష్టంతో, తన నటనతో స్టార్ హీరోగా అవతరించారు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మార్పుచెందారు. ప్రస్తుతం ఉన్న స్టార్ నటుల్లో నవరసాలను పలికించగలిగే ఏకైక నటుడు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.

ఆయన్ను అందుకోవడం ఎవరివల్లా కాదు
బొమ్మరిల్లు పతాకంపై సినిమాలు తీసిన దర్శకుడు వైవీఎస్ చౌదరి ప్రస్తుతం దివంగత నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ కుమారుడు జూనియర్ నందమూరి తారకరామారావును హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన మరోసారి మెగాఫోన్ పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామారావు అనే పేరును చాలామంది పెట్టుకుంటారని, అదే రూపం, అదే తేజస్సు, అదే కంఠంతోపాటు అప్పటి కాలమాన పరిస్థితుల్లో జన్మిస్తేనే నందమూరి తారకరామారావు అవుతారన్నారు. ఎన్టీఆర్ చదివిన పుస్తకాలు, గ్రంథాలు, కలిసిన మనుసులు, ఆయనకు ఉన్న జ్ఞానం కొలవలేమని, వాటిని అందుకోవడం ఎవరివల్లా కాదన్నారు.

director yvs chowdary controversial comments on junior ntr

ఎన్టీఆర్ అనేది ఓ లెజండరీ పేరు
ఎన్టీ రామారావు అనే ఓ లెజెండరీ పేరు అని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదని, ఆ వంశం వారు పేరు పెట్టుకోవడంవల్ల అదే పేరు వస్తుందని, నందమూరి తారకరామారావు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయన స్థాయిని అందుకోలేరని వ్యాఖ్యానించారు. ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని, తన బిడ్డకు ఆయన పేరు పెట్టుకుంటానన్నారు. అక్కినేని నాగేశ్వరరావుతో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి అనే సినిమా తీశారు. దీంతోనే ఆయన తొలిసారి దర్శకుడయ్యారు. తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, రేయ్ లాంటి సినిమాలు తీశారు. సీతయ్య సినిమా తీసే సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని చౌదరి ప్రయత్నించాడు. అయితే కథ నచ్చకపోవడంతో తారక్ తిరస్కరించాడు. అప్పటి నుంచి తారక్ అంటే చౌదరికి పడదని ఫిలింనగర్ లో టాక్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+