పుష్ప2లో ఐటం సాంగ్ కు ఆ హీరోయిన్ ను ఒప్పించిన బన్నీ, సుకుమార్?
పుష్ప2 ఐటం సాంగ్: సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాస్తవానికి తెలుగు కన్నా హిందీలోనే ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా విజయంలో దర్శకుడు, హీరోదే ప్రధాన పాత్రకాదు.. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ ఒక ప్రత్యేక గీతంలో నర్తించిన స్టార్ హీరోయిన్ సమంత పాత్ర కూడా ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఈ పాట అంత ప్రభావాన్ని సినీ ప్రియులపై చూపింది.
ప్రస్తుతం రెండో పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప2 సినిమా ఇందులో కూడా ప్రత్యేక గీతంలో ఎవరిని నటింపచేయాలా? అనే విషయంలో తలమునకలై ఉంది. సమంత రేంజ్ లో ఏ హీరోయిన్ ఒప్పుకుంటుందో వారికి అర్థం కావడంలేదు. చిత్రయూనిట్ అత్యధిక పారితోషికం ఆఫర్ చేయడంతోపాటు ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించినప్పటికీ అందరూ నో చెబుతున్నారు. దీంతో ఈ పాట తీయడం ఒక్కటే యూనిట్ కు పెద్ద సవాల్ గా మారింది. సమంతను మరోసారి సంప్రదించినప్పటికీ ఆమె నో చెప్పింది.

చివరకు ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి దిశా పటానీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మంచి ఫేమస్ కావడంతోపాటు ఈ పాట చేయడంవల్ల ఆమెకు, సినిమాకు ఇద్దరికీ హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. కుర్రకారులో దిశాకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా మంచి గ్లామర్ గా ఉండటం కూడా కలిసొస్తోంది. మొదటి భాగంలో సమంతకు వచ్చిన క్రేజ్ కంటే రెండో భాగంలో దిశాకే ఎక్కువ క్రేజ్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ గీతాన్ని సుకుమార్ ఎలా తీస్తాడో, ఎటువంటి పాట రాయిస్తాడో చూడాలి మరి.












Click it and Unblock the Notifications