విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ జంట..మొత్తానికి క్లారిటీ ఇచ్చేరుగా..!

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.

ఇటీవల బుల్లితెర నటులు కూడా ఎక్కువగానే విడాకులు తీసుకుంటున్నారు. వెండితెర నటులకు తాము ఏమాత్రం తీసిపోమని బుల్లితెర నటులు నిరూపిస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుల్లితెర జంట సంజయ్- పూనమ్ దంపతులకు బుల్లితెరపై మంచి గుర్తింపు ఉంది. పలు హిట్ సీరియల్స్‌లో నటించారు ఈ జంట. 2021లో పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు షికార్లు చేశాయి.

divorce rumors on famous serial telugu couple

గత కొంతకాలంగా సంజయ్‌కు ఆయన భార్య పూనమ్ విడాకులు ఇచ్చిందనే వార్త వైరల్‌గా మారింది. తాజాగా విడాకులపై సంజయ్‌ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తాము విడాకులు తీసుకుంటున్నామనే దానిలో ఎటువంటి వాస్తవం లేదని..ఇదింతా కూడా మీడియా ప్రచారమే అని సంజయ్ తేల్చేశారు.నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. అయితే ఆ వార్తలు ఆమె చూస్తే ఎంత బాధపడుతుందో అనిపించిందని కానీ ఆమె కూడా ఓ నటి కావడంతో ఈ వార్తలను ఆమె పెద్దగా పట్టించుకోలేదని సంజయ్ చెప్పుకొచ్చారు.మాకు విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. జీవితాంతం కలిసే ఉంటామని సంజయ్ తమ దాంపత్య జీవితాన్ని గురించి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+