ముసలోడే కానీ మహానుభావుడు..49 ఏళ్ల వయసులో తోటి నటిని లవ్ మ్యారేజ్ చేసుకున్న నటుడు
ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించాడు ఓ నటుడు. 49 ఏళ్ల వయస్సులో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వయస్సుకు , ప్రేమకు ఏమాత్రం సంబంధం లేదని సమాజానికి చాటి చెప్పాడు. గతంలో వెండితెర నటులు మాత్రమే ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారు.కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ బుల్లితెరకు సైతం పాకినట్టు కనిపిస్తోంది. వెండితెర నటులకు తాము ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర నటులు ఆకట్టుకుంటున్నారు. కేవలం నటనలోనే కాకుండా ,పెళ్లిళ్లు, ఎఫైర్లు పెట్టుకుని తాము సైతం రేసులో ఉన్నామంటూ సంకేతాలు ఇస్తున్నారు.
తాజాగా ఓ బుల్లితెర నటుడు తోటి నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే..ఆ నటుడు వయస్సు 49 సంవత్సరాలు. బుల్లితెర నటుడు వేణుగోపాల్ తన తోటి నటి దివ్య శ్రీధర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి 'పాతరమట్టు' అనే సీరియల్ నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి వివాహం కేరళ లోని గురువాయర్‌లో జరిగింది. అయితే అప్పటికే ఆమెకు పెళ్లై ఓ పాప , కూతురు ఉన్నారు. భర్త లేకపోవడంతో ఆమె తన ఇద్దరి పిల్లలతోనే జీవనం సాగిస్తున్నారు.

ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. తనకు మొదట ప్రపోజ్ చేసింది వేణుగోపాల్ అని.. తనని ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తనని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని వేణుగోపాల్ పట్టుబడడంతో చివరికి తనను ఒప్పించి.. తన కొడుకుని కూడా ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారని తెలిపారు. అలాగే తమకు తండ్రి దొరికాడని తమ కూతురు, కొడుకు సంతోషంగా ఉన్నారని తెలిపింది నటి దివ్య. కాగా దివ్య, వేణుగోపాల్ ఇద్దరూ ప్రేమ వివాహం నెటిజన్లు రకరకాలుగా రియాక్డ్ అవుతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications