ఎమ్మెల్సీ నాగబాబుకి.. అన్న, వదిన ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నాగబాబు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు.. ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు.. చిరు, సురేఖల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబును.. అన్న, వదినలు పూలమాలతో సత్కరించారు. అంతే కాకుండా ఖరీదైన పెన్నును కానుకగా అందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ఆ పోస్టులో ''ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య, వదిన'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

do-you-know-what-special-gift-is-gave-to-mlc-nagababu-by-megastar-chiranjeevi

అంతకు ముందు పవన్ ఎన్నికల్లో గెలిచి తర్వాత కూడా అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో కూడా సురేఖ తన మరిదికి కాస్ట్లీ పెన్ ని కానుకగా అందించారు. ఇప్పుడు మళ్లీ నాగబాబుకు కూడా అదే విధంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి పోస్టుపై నాగబాబు స్పందించారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో.. అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ కలాన్నే వినియోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించా అని పేర్కొన్నారు.

మరోవైపు గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి పని చేసిన విషయం తెలిసిందే. అలానే ఆయన మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు నటులు పాలిటిక్స్ లో పలు పదవుల్లో రాణించడం గ్రేట్ అంటూ మెగా అభిమానులు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండు కారణాలు. ఒకటి పవన్, రెండు పిఠాపురం ప్రజలు. వీరిద్దరి వలనే ఆయనకు విజయం దక్కింది. ఇవి కాకుండా పవన్ ను ఎవరైనా గెలిపించడానికి దోహదపడ్డామని వారనుకుంటే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ పట్ల టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+