''వర్షం'' సినిమా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
''వర్షం'' సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయనే చెప్పాలి.ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కెరీర్‌లో తొలి హిట్ ''వర్షం'' సినిమానే.అంతకు ముందు ప్రభాస్ నటించిన ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. అటువంటి తరుణంలో వచ్చిన ''వర్షం'' సినిమా ప్రభాస్‌ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది.బాక్సాఫీస్ వద్ద ''వర్షం'' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రభాస్-త్రిష కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు.
శోభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‌గా హీరో గోపీచంద్ నటించారు. ప్రకాష్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద అస్సెట్‌గా నిలిచిందనే చెప్పాలి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రం.. 2004 జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. 125 కేంద్రాలలో 50 రోజులు, 95 కేంద్రాలలో 100 రోజుల రన్ మరియు 24 కేంద్రాలలో 175 రోజుల వేడుక జరుపుకుంది.

మూడు నందిలతో సహా అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో మొదట ప్రభాస్ అనుకోలేదట దర్శకుడు. డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కన్నా ముందు మరొక హీరోతో వర్షం మూవీని చేయాలని భావించాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును తొలుత మహేష్ బాబుకు వర్షం కథ వినిపించాడట దర్శకుడు. అయితే కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట మహేష్.
ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వర్షం కార్యరూపం దాల్చింది. కట్ చేస్తే వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్‌కు భారీ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అయితే మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. . డైరెక్టర్ శోభన్‌తో మహేష్ బాబు బాబీ అనే సినిమా చేశారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో డైరెక్టర్ శోభన్‌తో మరో సినిమా చేయలంటే భయపడే మహేష్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications