నాగచైతన్యకు ముందు శోభిత ధూళిపాళ ఎవరిని ప్రేమించిందో తెలుసా?
శోభిత ధూళిపాళ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటే కాదు.. ప్రస్తుతం ప్రఖ్యాత అక్కినేనివారి ఇంటి కోడలైంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకోవడానికి ముందు ఇద్దరూ రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఫొటోలు బయటకు వచ్చిన సందర్భంలో వివరణ కోరగా అటువంటిదేమీ లేదని చెప్పారు. చివరకు 300 మంది అతిథుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరగడంవల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ఈ జంట చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.
అతని కోసం వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతుండగా మీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటూ యాంకర్ అడగ్గా అందుకు ఆమె బదులిస్తూ తాను స్కూల్లో చదివే రోజుల్లో తన క్లాస్ సీఆర్ సార్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అతని దృష్టిలో పడేందుకు, అతన్ని ఆకర్షించేందుకు వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని అని చెప్పింది. అది ప్రేమా? లేదంటే క్రష్షా? అనేది తాను స్పష్టంగా చెప్పలేనంది. అయితే తాను ఏదో ఒకటి చేసి అతని దృష్టిని తనవైపు మళ్లించుకునేలా ప్రయత్నాలు మాత్రం చేసేదాన్ని అని శోభిత చెప్పింది.

ఆయన పట్టించుకోకపోతే ఎంతో బాధపడ్డాను
సీఆర్ సార్ తనను పట్టించుకోలేదని, దీనివల్ల తాను చాలా బాధపడ్డానంది. ఆ వయసులో తనకు ఏమీ తెలియనప్పటికీ వయసు పెరిగే కొద్దీ కొంత మెచ్యూరిటీ వచ్చిందని, కాలేజ్ లో చదువుకునే రోజుల్లో కొందరు ప్రేమలేఖలు రాసేవారని, తాను కూడా కొన్ని లేఖలు రాశానని తడబడకుండా చెప్పింది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించిన శోభిత ప్రస్తుతం గూఢచారి2లో నటిస్తోంది. మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న శోభిత స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని శోభితతో ప్రేమలో పడ్డారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత మాత్రం ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తోంది. హైదరాబాద్ లో తక్కువగా ఉంటూ, ముంబయిలో ఎక్కువకాలం జీవిస్తోంది.












Click it and Unblock the Notifications