దేశం కోసం ప్రాణాలు అర్పించిన హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా..? దారుణంగా ఉగ్రవాదుల చేతిలో హతం

దేశం రక్షణ కోసం సైనికులు చాలామంది ప్రాణాలు ఆర్పించారు, ఆర్పిస్తున్నారు కూడా. ముఖ్యంగా ఆర్మీ సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు చిన్నపాటి యుద్ధం కూడా సాగింది. ఈ యుద్ధంలో కొందరు సైనికులు మరణించారు. ఇలా దేశం కోసం చాలామంది మరణించారు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది కుటుంబీకులు ఆర్మీల్లో పని చేస్తున్నారు.

ప్రియాంక తల్లిదండ్రులు ఇద్దరూ భారత సైన్యంలో వైద్యులుగా పనిచేశారు. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ తండ్రి హరి ఓం భాటియా ఆర్మీ అధికారిగా పని చేశారు.హీరోయిన్ లారా దత్తా తండ్రి వింగ్ కమాండర్ ఎల్.కె. దత్తా భారత వైమానిక దళంలో పనిచేశారు. సుష్మితా సేన్ తండ్రి వింగ్ కమాండర్ షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో పనిచేశారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ జింటా ఆర్మీ అధికారి.రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేందర్ సింగ్ ఆర్మీ అధికారిగా పని చేశారు.

Do you know who the father of the heroine who sacrificed her life for the country is

గుల్ పనాగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ హర్చరణ్‌జిత్ సింగ్ పనాగ్, నేహా ధూపియా తండ్రి కమాండర్ ప్రదీప్ సింగ్ ధూపియా భారత నావికా దళంలో పనిచేశారు. అర్జున్ రాంపాల్ తాత బ్రిగేడియర్ గుర్దయాల్ సింగ్ ఆర్మీ అధికారిగా కొనసాగారు. అయితే ఓ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి ఆర్మీలో పని చేస్తూ వీర మరణం పొందారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు..నిమ్రత్ కౌర్. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తండ్రి, మేజర్ భూపేందర్ సింగ్, భారత సైన్యంలో ఒక ధైర్యవంతుడైన అధికారి. ఆయన దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన విధానం నిజంగా హృదయ విదారకమైనది , స్ఫూర్తిదాయకమైనది.

కాశ్మీర్‌లోని వెరినాగ్‌లో మేజర్ భూపేందర్ సింగ్ అక్కడ ఆర్మీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించేవారు. జనవరి 17, 1994న, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మేజర్ భూపేందర్ సింగ్‌ను ఆయన కార్యాలయం నుండి కిడ్నాప్ చేశారు. ఏడు రోజుల పాటు నిర్బంధించిన తర్వాత, వారు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. ఉగ్రవాదులు కొందరు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు, కానీ దేశభక్తుడైన మేజర్ భూపేందర్ సింగ్ వారి డిమాండ్లకు తలొగ్గలేదు. తన కర్తవ్యానికి కట్టుబడి ఉంటూ, ఆయన తన ప్రాణాలను అర్పించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 44 సంవత్సరాలు.

నిమ్రత్ కౌర్ తన తండ్రి మరణ వార్త విని తీవ్రంగా కుంగిపోయారు. ఆమె తన తండ్రి భౌతికకాయాన్ని మొదటిసారి ఢిల్లీలో చూశారు. ఆ తర్వాత వారి కుటుంబం నోయిడాకు మారింది. మేజర్ భూపేందర్ సింగ్ యొక్క ధైర్యానికి ,దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా, ఆయనకు మరణానంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డులలో ఒకటైన శౌర్య చక్ర లభించింది. నిమ్రత్ కౌర్ తన తండ్రిని తలుచుకుంటూ తరచుగా గర్వంగా ఫీల్ అవుతారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి మరణం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చిందని, అయితే హింస ఎప్పటికీ పరిష్కారం కాదని తాను నమ్ముతానని చెప్పారు. నిమ్రత్ కౌర్ ఒక గొప్ప నటిగానే కాకుండా, ఒక అమరవీరుడి కుమార్తెగా కూడా మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఆమె తండ్రి దేశం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+