అమీర్ ఖాన్‌పై ఆయన తమ్ముడు సంచలన కామెంట్స్.. ఏడాదిపాటు బంధించాడంటూ !
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తన సోదరుడు ఫైసల్ ఖాన్ ఆయనపై చేసిన సంచలన ఆరోపణలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఏడాది పాటు బంధించి..
అమీర్ ఖాన్ తనను ఒక సంవత్సరం పాటు గదిలో బంధించారని ఫైసల్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తన ఫోన్ కూడా లాక్కున్నారని.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని విషయాల్లో తాను కుటుంబంతో ఏకీభవించకపోవడంతో.. మానసిక సమస్యలున్నాయని తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.

సమాజానికి హాని చేస్తాననే నెపంతో గది బయట బాడీగార్డులను పెట్టి ఉంచారని వాపోయారు. బలవంతంగా మందులు ఇచ్చేవారని.. తన తండ్రిని కూడా కలిసే అవకాశం ఇవ్వలేదని ఫెయిర్ అయ్యారు. 20 రోజులపాటు మానసిక వైద్యం తీసుకుని.. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ రకంగా నిర్బంధం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు ఫైసల్ చెప్పారు.
అమీర్, ఫైసల్ కలిసి 2000లో విడుదలైన మేళా సినిమాలో నటించారు. ఫైసల్ పలు హిందీ చిత్రాల్లో నటించడంతో పాటు, తన తండ్రి సినిమాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. అయితే ఆస్తి పంచుకునే విషయంలో వారి మధ్య చాలాకాలంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు అమీర్ ఖాన్.. 1988లో కయామత్ సే కయామత్ తక్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. లగాన్, దిల్ చాహ్తా హై, రంగ్ దే బసంతీ, 3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే.. సినిమాలతో రికార్డులు సృష్టించారు. 2016లో వచ్చిన దంగల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
రీసెంట్ గానే " సితారే జమీన్ పర్ " అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అమీర్. తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా జూన్ 20న రిలీజ్ అయ్యింది. భారీ కలెక్షన్స్ కొల్లగొట్టక పోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.












Click it and Unblock the Notifications