సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత బోల్డ్ ఫొటోస్
తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కొంతకాలం తర్వాత సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఫొటోలు షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. బోల్డ్ అవతార్ లో కనిపిస్తున్న సమంత ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమాలకు ఏడాదికిపైగా విరామం తీసుకున్న సమంత ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజ్ పై బోల్డ్ ఔట్ ఫిట్ తో పరేషాన్ చేస్తోంది.
తాజాగా అమెరికా, భూటాన్ దేశాల్లో తన పర్యటనను పూర్తిచేసుకుంది. మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే సినిమాలకు సంబంధించిన కథలను వింటోంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. నాగచైతన్యతో పెళ్లి అయిన సమయంలో ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో పలు కోట్స్ షేర్ చేస్తూ తనలోని భావాలను బయటపెడుతోంది.

చివరిగా ఖుషి సినిమాలో కనిపించింది. ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో కొత్తవారికి అవకాశాలు కల్పించాలనుకుంటోంది. వీటికి సంబంధించిన బాధ్యతలను ఆమె సన్నిహితులు చూస్తున్నారు. కొత్తతరం ఆలోచనలనలకు ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు భావ వ్యక్తీకరణ ఉన్న కంటెంట్ ను అందించడమే తమ ఉద్దేశమని సమంత చెబుతోంది.
వ్యాపార రంగంలోకి కూడా చురుగ్గా అడుగు పెడుతూ తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉంది. సమంత అప్పుడప్పుడు పరోక్షంగా చేస్తున్న కొన్ని కామెంట్స్ నాగచైతన్యను ఉద్దేశించే ఉంటున్నాయని, అయితే ఇంతవరకు నాగచైతన్య ఒక్కసారి కూడా సమంతపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, సమంత కూడా అటువంటి పరోక్ష కామెంట్స్ చేయకుండా ఉంటే మంచిదని అక్కినేని అభిమానులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications