ఫ్రీడమ్ సేల్స్ తో రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ సేల్ కు సిద్ధమవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లు ఫ్రీడమ్ సేల్స్ ను ప్రకటించాయి. ఈ క్రమంలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ఆగస్ట్ 7నుండి ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ 8 నుండి ప్రారంభం కానుంది.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్

ప్రతీ సంవత్సరం అమెజాన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ లో అందరూ పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. హెచ్డీఎఫ్సి క్రెడిట్ కార్డ్ తో చేసే కొనుగోళ్ళపై 10శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ హోల్డర్ లకు 5శాతం క్యాష్ బ్యాక్ అందుతుంది.

amazon flipkart sale Amazon Great Freedom Sale starts August 7 Flipkart Freedom Sale from August 8

భారీ డిస్కౌంట్ లు, క్యాష్ బ్యాక్ రివార్డులు, గిఫ్ట్ కార్డులతో సేల్

2 వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ రివార్డులు, గిఫ్ట్ కార్డులు, ఓచర్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ రీ చార్జ్ లపై 50 రూపాయల వరకు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 999 రూపాయల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్, ల్యాప్ ట్యాప్ లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజెస్ పై ఆకర్షణీయ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి.

ఫ్లిప్ కార్ట్ సేల్ వివరాలు ఇలా

అంతేకాదు లిమిటెడ్ టైం ఆఫర్లు, 8pm డీల్స్, ట్రెండింగ్ డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఇప్పటికే ఈ సేల్ కి సంబంధించిన మైక్రో సైట్ అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్ కార్ట్ విషయానికి వస్తే ప్లస్, బ్లాక్ సబ్ స్క్రైబర్ లకు 24గంటల ముందే వీరికి సేల్ అందుబాటులోకి వస్తుంది. sbi క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ రాయితీ లభిస్తుంది.

ప్రముఖ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ లు

అంతేకాదు ఎంపిక చేసిన వస్తువులపై వడ్డీ లేని emi సదుపాయం కూడా అందుతుంది. ఐఫోన్ 17, సామ్సంగ్ గెలాక్సీ, ఎస్ 25, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్ వంటి ప్రముఖ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ లు ఉంటాయి. ఇప్పుడు మాత్రమే కాక లాప్టాప్స్, టాబ్లెట్స్, హోమ్ అప్లయెన్సెస్, టీవీల పైన కూడా భారీ ఆఫర్లు ఉంటాయి.

ఫ్రీడమ్ సేల్ అసలే మిస్ చేసుకోవద్దు

ఇక flipkart లో టాప్ డీల్స్, మేడిన్ ఇండియా, టిక్ టాక్ వంటి ప్రత్యేక ఆఫర్లు భాగంగా ఉండనున్నాయి. కస్టమర్ లను ఆకట్టుకునేలా ఈ సంవత్సరం కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందించే ఈ ఫ్రీడమ్ సేల్స్ ను అసలు మిస్ చేసుకోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+