'ఊటీ' కంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. ఈ హిల్ స్టేషన్ కు ఎలా వెళ్లాలంటే..?

వింటర్ సీజన్ లో అనేక టూరిస్టు ప్రాంతాలు పర్యటకులను ఆకర్షిస్తుంటాయి. ఓ వైపు వర్షం పడుతుంటే చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏదైనా హిల్ స్టేషన్ కు వెళ్లాలని చాలామంది భావిస్తుంటారు. అయితే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో హిల్ స్టేషన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ఫేమస్ హిల్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది టూర్ అనగానే గోవా గుర్తుకువస్తుంది. గోవాకు వెళ్తుంటారు. ఇంకొందరు దగ్గర్లోని ఊటీ కు వెళ్తుంటారు. కానీ గోవా, ఊటీను మించిన అందాలతో ప్రకృతి రమణీయమైన పర్యాటక ప్రాంతంగా తమిళనాడులోని కోటగిరి హిల్ స్టేషన్ ఉంది. రద్దీ తక్కువగా ఉండే ఈ పర్యాటక ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఎప్పుడూ బిజీ లైఫ్ కు అలవాటుపడిన వారు సిటీ లైఫ్ కు దూరంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఈ పర్యాటక ప్రాంతం బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. సాధారణంగా ఊటీలో జనప్రవాహం ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవులు అయినా.. వీకెండ్ అయినా ఊటీ మొత్తం పర్యటకులతో నిండిపోతుంది. ఓ వైపు ట్రాఫిక్ జామ్స్.. మరోవైపు వ్యూ పాయింట్స్ వద్ద భారీగా జనాలు ఉంటారు. దాంతో అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరోవైపు తమిళనాడులోని కోటగిరి హిల్ స్టేషన్ మాత్రం చాలా ప్రశాంతంగా తక్కువ రద్దీగా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ లో పచ్చని టీ ఎస్టేట్స్, హోమ్ స్టేస్, రిసార్ట్స్ అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Kotagiri hill station in Tamil Nadu emerged best tourist destination than Ooty during monsoonseason

ఇక్కడి సహజసిద్ధమైన కొండలు మంచుతో కప్పబడి పర్యటకులను ఆకర్షిస్తుంటాయి. ఇది అద్భుతమైన వ్యూ అని చెప్పొచ్చు. ఇక వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని జలపాతాలు టూరిస్టులను కనువిందు చేస్తుంటాయి. ఈ సీజన్ లో ఫొటోగ్రఫీకి ఇవి బెస్ట్ స్పాట్స్ గా ఉంటాయి. ఇక వర్షాకాలంలో టీ ఎస్టేట్స్ అన్నీ పచ్చదనంతో మురిసిపోతుంటాయి. ఇక కోటగిరి హిల్ స్టేషన్ లో చూడదగిన ప్రాంతాలుగా క్యాథరిన్ ఫాల్స్, లాంగ్ ఉడ్ షోలా ఫారెస్ట్స్, కోడనాడ్ వ్యూ పాయింట్, ఎల్క్ ఫాల్స్ ఉన్నాయి. ఇక ఇక్కడి ప్రాంతానికి చేరుకోవాలంటే కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ కు ముందుగా చేరుకోవాలి. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో కోటగిరికి చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం అయితే మేట్టు పాళయం రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కోటగిరి ప్రాంతానికి చేరుకోవచ్చు. అలాగే రోడ్డు మార్గం అయితే ఊటీ, కూనూర్, కోయంబత్తూర్ తదితర నగరాల నుంచి కోటగిరి ప్రాంతానికి చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+