Artificial Sun: భూమిపై ‘కృత్రిమ సూర్యుడి’ సృష్టికి మరో భారీ అడుగు! (వీడియో)

Artificial Sun: భూమిపై కృత్రిమ సూర్యుడిని సృష్టించే దిశగా చెైనా ఓ ఓ అడుగు ముందుకేసింది. న్యూక్లియర్ ఫ్యూజన్(అణు సంలీనం) ద్వారా స్వచ్ఛమైన, అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ అయస్కాంతాన్ని విజయవంతంగా నిర్మించి పరీక్షించింది. 2030 నాటికి ఫ్యూజన్ శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్రి చేయాలన్న చైనా ప్రతిష్టాత్మక ప్రణాళికలో ఈ విజయం ఓ కీలక మైలురాయిగా నిలిచింది. దీనితో కార్బన్ రహిత ఇంధనానికి అతిపెద్ద వనరును సాధించే ప్రయత్నంలో చైనా అగ్రగామి దేశాల సరసన చేరింది. ఈ సూపర్ కండక్టింగ్ అయస్కాంతాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఒక భారీ 'D' ఆకారపు నిర్మాణం. ఈ బృహత్ నిర్మాణం బరువు 582 టన్నులు.

టూత్ పిక్స్ వ్యాపారం.. చైనాకు ఇన్ని కోట్లా?
టూత్ పిక్స్ వ్యాపారం.. చైనాకు ఇన్ని కోట్లా?

కృత్రిమ సూర్యుడు అంటే ఏమిటి?
కృత్రిమ సూర్యుడు అనేది ఓ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. ఇది సూర్యునిలో అపారమైన శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియనే పునఃసృష్టిస్తుంది. ఇది 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్ అణువులను సంలీనం చేస్తుంది. ఈ ప్రక్రియ కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేయకుండానే అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత అపరిమితమైన శక్తికి మూలంగా నిరూపించబడుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

China Artificial Sun World Largest Fusion Magnet Tested Successfully A Major Milestone for Unlimited Energy

భారీ అయస్కాంతంతో పాటు చైనా పరిశోధకులు అధిక-ఉష్ణోగ్రత సూపర్ కండక్టింగ్ సెంట్రల్ సోలెనాయిడ్ నాణేన్ని కూడా విజయవంతంగా పరీక్షించారు. దీనిని ఫ్యూజన్ రియాక్టర్ గుండె అని పిలుస్తారు. ఇది కారు ఇంజిన్‌లోని స్పార్క్ ప్లగ్ లాగా పనిచేస్తుంది. ఫ్యూజన్ రియాక్టర్‌లో ఈ భాగం చర్యకు అవసరమైన ప్లాస్మాను ప్రారంభించడానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది.

బంగారం ధరల్లో భారీ డౌన్ ఫాల్- ఆచితూచి వ్యవహరించక తప్పదు
బంగారం ధరల్లో భారీ డౌన్ ఫాల్- ఆచితూచి వ్యవహరించక తప్పదు

ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ అయస్కాంతం
ప్రపంచంలోనే ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ రియాక్టర్ అయస్కాంతం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీని పరిమాణం ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) కోసం నిర్మించిన ఇలాంటి అయస్కాంతం కంటే 1.3 రెట్లు పెద్దది. ఇది నిల్వ చేయగల శక్తి కూడా మూడు రెట్లు ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను పేర్కొంటున్నారు.

శక్తివంతమైన అయస్కాంతం ఎలా పనిచేస్తుంది?
ఈ అయస్కాంతం చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది ప్లాస్మాను రియాక్టర్ లోపలే బంధించి, గోడలను తాకకుండా నిరోధిస్తుంది. ఈ ప్లాస్మా అనేది 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయబడిన ఒక వాయువు. ఈ సాంకేతికతను పూర్తిగా దేశీయ ముడి పదార్థాలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశామని చైనా చెబుతోంది. దీనివల్ల ఫ్యూజన్ కోసం విదేశీ సరఫరాదారులపై బీజింగ్ ఆధారపడటం తొలగిపోయింది. 2030 నాటికి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వాణిజ్యపరంగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే చైనా లక్ష్యానికి ఈ ప్రయోగ విజయం అతిపెద్ద పునాదిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+