ఆ స్టార్ హీరోకు వ్యతిరేకంగా పోస్ట్ చేసిన హీరోయిన్
ఓ హత్య కేసులో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడతో దర్శన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమెను రేణుకా స్వామి అనే వ్యక్తి హింసిస్తుండటంతో ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ కు చెప్పింది. దీంతో దర్శన్ కోపంతో రేణుకా స్వామిని హత్య చేయించినట్లు సమాచారం. రేణుకాస్వామి తల్లి దర్శన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేయడంతోపాటు మరో తొమ్మిది మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అందరికంటే ముందుగా, మొదటి నిందితురాలిగా పవిత్రను పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం.
రమ్య ఇలా కక్ష తీర్చుకున్నారు
వీరిద్దరికీ ఉరిశిక్ష విధించాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై మాజీ ఎంపీ, స్టార్ హీరోయిన్ రమ్య రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రమ్య అలా చేయడానికి ఓ కారణం ఉంది. గత ఎన్నికల్లో దర్శన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో అతనిపై ఈవిధంగా ఆమె కక్ష తీర్చుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇది మన ఏరియా అన్న దర్శన్
కన్నడ హీరో దర్శన్ ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన వ్యక్తిగా మారారు. వివాదాస్పద కామెంట్లు చేయడం, కన్నడ అనే భావనను ప్రజల్లో రెచ్చగొట్టేలా మాట్లాడటం, నోటి దురుసుతనం లాంటివాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సలార్ సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. ఎంతమంది స్టార్లు వచ్చినా కన్నడ పరిశ్రమపై ప్రభావం చూపలేరని, సలార్ వస్తే రానివ్వండి.. కానీ కర్ణాటకలో ఎటువంటి ప్రభావం చూపలేదని, వాళ్లే మనల్ని చూసి భయపడాలని, ఇది మన ఏరియా అంటూ కామెంట్లు చేశారు. సలార్ నిర్మించింది కన్నడ సంస్థ హోంబలే కాగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కర్ణాటకకు చెందినవారే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications